బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. రెండో వన్డేలో గెలిచి ఎలాగైన సిరీస్ ను సమం చేయాలని ఆరాటపడుతోంది. అయితే టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలహీనంగా కనిపిస్తుంది. జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి రోహిత్ శర్మపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు మాజీలు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ క్రీడా వెబ్ సైట్ రోహిత్ కెప్టెన్సీపై పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో నెటిజన్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొని రోహిత్ కు తమ రేటింగ్ ను ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? ఈ పోల్ లో టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా పాల్గొన్నాడు. రోహిత్ కు రేటింగ్ ను సైతం ఇచ్చాడు.
టీమిండియా.. గత కొంత కాలంగా ఏ మేజర్ ICC ట్రోఫీ గెలిచిన దాఖలాలు లేవు. కెప్టెన్ గా ధోని వైదొలిగిన తర్వాత భారత్ ఒక్కటంటే ఒక్కటి మెగా టోర్నీ గెలిచిన చరిత్ర లేదు. దాంతో ఎలాగైన ఈ సారి టీ20 వరల్డ్ గెలవాలి అని పట్టుదలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. కానీ బౌలర్ల వైఫల్యంతో సెమీస్ లో ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. దాంతో టీమిండియా సారథి రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత బంగ్లా పర్యటనకు కెప్టెన్ గా తిరిగి పగ్గాలు చేపట్టాడు రోహిత్. ఇక ఈ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత్ పరాజయం పొందింది. దాంతో రోహిత్ కెప్టెన్సీపై మరోసారి విమర్శల బాణాలు దూసుకొచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ క్రీడా వెబ్ సైట్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై పోల్ ను నిర్వహించింది. అధిక సంఖ్యలో ఈ పోల్ లో పాల్గొన్న నెటిజన్లు రేటింగ్ రూపంలో పాయింట్లు ఇచ్చారు. ఇక ఈ పోల్ లో యువరాజ్ సింగ్ సైతం పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచాడు. రోహిత్ కెప్టెన్సీకి తాను 10కి 10 మార్కులు ఇస్తానని కామెంట్ చేశాడు. కెప్టెన్ అన్నాక కొన్ని సిరీస్ లలో వైఫల్యం కావడం సహజమే అన్నాడు. టీమిండియాకు ప్రస్తుతం రోహిత్ అత్యుత్తమ కెప్టెన్ అని వ్యాఖ్యానించాడు. దాంతో యువరాజ్ ఇచ్చిన రేటింగ్ సరైందేనని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మరీ పదికి పది రేటింగ్ ఏంటి? అని రిప్లైలు ఇస్తున్నారు.
What are your thoughts? 🤔#crickettwitter #indvsban pic.twitter.com/lX4ZEn9OQY
— Sportskeeda (@Sportskeeda) December 4, 2022
10 out of 10
— Yuvraj Singh (@YUVSTRONG12) December 5, 2022