టీమిండయా జట్టులో ఆల్‌రౌండర్‌గా ఉండి బౌలింగ్, బ్యాటింగ్‌లో తన మార్క్‌ను చూపించిన ఆటగాడు. టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే ప్రపంచ కప్ 2011 సాధించిన జట్లలో సభ్యుడు. ఐపీఎల్‌లో మొదట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడి హార్డ్ హిట్టర్‌గా పేరుతెచ్చుకుని తర్వాత కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగాడు. ఈ మధ్యే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతను మరెవరో కాదు టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు హార్డ్ హిట్టర్ యూసుఫ్ పఠాన్.
భారీ సిక్సులతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆటగాడు గతంలో తాను క్లబ్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్న సమయంలో దిగిన ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఈ ఫొటోలో నేను ఎక్కడ ఉన్నానో గుర్తించండి అంటూ నెటిజన్లకు సవాలు విసిరాడు. క్రికెట్‌ను మతంలా ఆరాధించే దేశంలో తమ అభిమాన క్రికెటర్‌ను గుర్తుపట్టడం ఒక లెక్క. గుర్తుపట్టివారందరూ కామెంట్ల రూపంలో ఆ ఫొటోలో పఠాన్ ఎక్కడున్నది కరెక్టుగా చెప్పేస్తున్నారు. ఇంతకి అందులో పఠాన్ ఎక్కడ ఉన్నాడో మీరు గుర్తుపట్టారా? గుర్తుపడితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.