క్రికెట్ హంగామా ఐపీఎల్‌కు వీక్షకులు భారీ సంఖ్యలో ఉంటారు. ఐపీఎల్ నడుస్తున్నంత కాలం టీవీలకు అతుక్కుపోతుంటారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో కూడా లక్షల్లో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్ లైవ్ చూస్తున్నారు. రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికి సుపరిచితమైన యూట్యూబ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ చూడొచ్చు. అవును.. 2023-2027 మధ్య ఐపీఎల్ సీజన్ల సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను యూట్యూబ్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఇకపై యూట్యూబ్‌లో ఐపీఎల్ మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
మరి లైవ్ ఉచితంగా ఉంటుందా.. పెయిడా అనేది తెలియాల్సి ఉంది. హాట్‌స్టార్‌తో పోల్చుకుంటే.. యూట్యూబ్‌కు యూజర్లు ఎక్కువ. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లను చూసే వారి సంఖ్య మరింత పెరగొచ్చు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో సగటున 50 లక్షల మంది లైవ్ చూస్తున్నారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో మొదటి సారి మీడియా రైట్స్‌ను కూడా వేలం వేయాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మీడియా రైట్స్ దక్కించుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యాపిల్ ఆసక్తి చూపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌ను యూట్యూబ్ తీసుకుంటుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: 8 సిక్సులతో విధ్వంసం సృష్టించిన రస్సెల్! తిట్టిన అంపైర్
— Sayyad Nag Pasha (@PashaNag) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.