రాయపూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మ్యాచులో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. తొలుత బౌలర్లు విజృభించడంతో 108 పరుగులకే కివీస్ ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటర్లు చెలరేగడంతో పవర్ ప్లే ముగిసేలోపు వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచులో టీమిండియా సారధి రోహిత్ శర్మ ప్రతి సందర్భంలోనూ హైలైట్ అవుతున్నాడు. మొదట టాస్ సమయంలో తడబాటుకు లోనైన హిట్ మ్యాన్ మతిమరుపుతో సతమతమయ్యాడు. టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని మరిచిపోయానంటూ కాసేపు అలాగే నిలబడిపోయాడు. ఈ ఘటనతో మైదానంలో నవ్వులు పూయించిన రోహిత్, మరో ఘటనలో తన మంచి మనసుతో అభిమానుల మనసు కొల్లగొట్టాడు.
కివీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో అభిమానులకు ఆశించిన స్థాయిలో ఎంటెర్టైనమెంట్ లభించలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ బ్యాటర్లు.. క్రీజులో నిలబడటానికే నానా తిప్పలు పడ్డారు. ఒకరి వెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు. 108 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 34.3 ఓవర్లలోనే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతూ.. విజయం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే, ఈ మ్యాచులో చెప్పొకోదగ్గ విషయం అంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ చర్యలే. మొదట టాస్ సమయంలో రోహిత్ ఏదో లోకంలోకి వెళ్లిపోయాడు. టాస్ గెలిచి తన నిర్ణయాన్ని చెప్పేందుకు టైం తీసుకున్నాడు. తన మతిమరుపుతో గజినీ సినిమాలో సూర్యను తలపించాడు. ఆ సమయంలో అభిమానులు సహా కివీస్ కెప్టెన్ కూడా నవ్వుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
Rohit Sharma 😂🤣😅pic.twitter.com/ev9hDsB7Ua
— CricTracker (@Cricketracker) January 21, 2023
అయితే, ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక పిల్లాడు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. ఆ పిల్లాడు నేరుగా రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి హత్తుకున్నాడు. వెంటనే అప్రతమట్టమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ పిల్లాడిని బలవంతంగా తీసుకెళ్తుంటే.. ‘చిన్న పిల్లాడు.. వదిలేయండి..’ అంటూ రోహిత్ వారిని వారించాడు. ఈ దృశ్యాలు ఎమోషన్ ను తలపించాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంఘటన చూశాక రోహిత్ ను అభిమానులు ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. ‘రోహిత్ గొప్ప మనసు..’ ‘మనసున్నోడివి..’ అంటూ తమకు నచ్చిన క్యాప్షన్లు జోడించి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచులో భారత్ విజయానికి 29 పరుగుల దూరంలో ఉంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma doesn’t have fans, he has devotees @ImRo45 ❤️
I wanted to be in the place of that boy how lucky he was 🥹#RohitSharma #INDvNZ pic.twitter.com/b96vXMMCCT— SALAAR 🏹 (@bhanurockz45) January 21, 2023
Rohit Sharma asking the security guard not to do anything against the fan.
Nice gesture from Captain. pic.twitter.com/pLS9NE9D40
— Johns. (@CricCrazyJohns) January 21, 2023