1993లో యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో షేన్ వార్న్ విసిరిన బంతి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. మ్యాచ్‌లో రెండో రోజు వార్న్ బౌలింగ్‌కి రాగా.. అప్పుడు క్రీజులో ఇంగ్లాండ్ బ్యాటర్ మైక్ గాటింగ్ ఉన్నాడు. అప్పటికే ఇంగ్లాండ్ టీమ్‌లో గాటింగ్ అగ్రశ్రేణి బ్యాటర్.. అలానే స్పిన్‌ని ఆడటంలోనూ అతనికి మెరుగైన రికార్డ్ ఉంది. కానీ.. ఆరోజు మొదటి బంతికే గాటింగ్‌ని షేన్ వార్న్ తన స్పిన్‌తో నోట్లో మాట రాకుండా చేశాడు.
షేన్ వార్న్ విసిరిన బంతి ఔట్ సైడ్ లెగ్‌లో పడి.. గాటింగ్ బ్యాట్, ప్యాడ్స్‌ని తప్పించుకుంటూ వెళ్లి ఆఫ్ స్టంప్‌ని గీరాటేసింది. అసలు బంతి ఎలా వెళ్లిందో అర్థంకాక గాటింగ్ అలాగే చూస్తుండి పోయాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? ఫీల్డ్ అంపైర్ కూడా నోరెళ్లబెట్టి అలా చూస్తుండిపోయాడు. వార్న్ సృష్టించిన ఆ అద్భుతాన్ని ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా క్రికెట్ ప్రపంచ ఇప్పటి వరకూ కీర్తిస్తునే ఉంది.
ఇటివల వార్న్ మరణించిన సమయంలో కూడా బాల్ ఆఫ్ ది సెంచరీని గుర్తుచేసుకుంది క్రికెట్ లోకం. తాజాగా పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో వార్న్ వేసిన బాల్ ఆఫ్ ది సెంచరీ బంతి రిపీట్ అయింది. అప్పటి అద్భుత బంతికి రీప్లేలా ఉన్న ఈ స్పిన్ మ్యాజిక్‌ను పాక్ స్పిన్నర్ యాసిర్ షా ఆవిష్కరించాడు. దీంతో వార్న్ వేసిన బాల్ ఆఫ్ ది సెంచరీ బంతిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం అభిమానులకు మరోసారి దక్కిందని క్రికెట్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం యాసిర్ షా వేసిన బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీ 2గా కొంతమంది క్రికెట్ పండితులు అభివర్ణిస్తున్నారు.
గాలేలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు యాసిర్ షా ఈ డ్రీమ్ డెలవరీని వేశాడు. అప్పట్లో గాటింగ్‌లానే ఇప్పుడు శ్రీలంక బ్యాటర్ కుశల్ మెండీస్ వద్ద కూడా సమాధానం లేకపోయింది. ఎక్కడో లెగ్ సైడ్ వైడ్‌బాల్‌గా వెళ్తున్న బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేస్తుంటే.. ఎంతటి గొప్ప బ్యాటర్ అయినా సరై అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అది గాటింగ్ అయినా కుశల్ మెండీస్ అయిన. ఎందుకంటే అది ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ కనుక. మరి యాసిర్ షా వేసిన బంతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ball of the Century candidate❓
Yasir Shah stunned Kusal Mendis with a stunning delivery which reminded the viewers of Shane Warne’s ‘Ball of the Century’.#SLvPAK pic.twitter.com/uMPcua7M5E
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 18, 2022