ఐపీఎల్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అదరగొట్టే కుర్రాడు యశస్వి జైస్వాల్.. ఇరానీ కప్‌లో చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుత బ్యాటింగ్‌తో కొత్త రికార్డులు నెలకొల్పాడు.
ముంబై ఆటగాడు, ఐపీఎల్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసం సంపాదించేకునే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీమిండియాలో ఓపెనింగ్ స్థానం కోసం పోటీ పడే ఆటగాళ్ల జాబితాలో తన పేరు కూడా చేర్చాలనే హుకూం జారీ చేశాడు. దేశవాళీ టోర్నీ ఇరానీ కప్‌లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో సంచలన బ్యాటింగ్‌తో గత రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఇరానీ కప్ చరిత్రలోనే ఇలాంటి బ్యాటింగ్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి.. అరంగేట్రం మ్యాచ్‌ల్లో 334 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు.
రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్.. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. దేశవాళీ క్రికెట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న జైస్వాల్.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సులతో 213 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇరానీ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే డబుల్ సెంచరీ చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటాడు. 132 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. దీంతో.. ఇరానీ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా యశస్వి నిలిచాడు. గతంలో శిఖర్ ధావన్ సైతం ఒకే మ్యాచ్‌లో 300 ప్లస్‌రన్స్ చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన 11 ప్లేయర్‌గా నిలిచాడు జైస్వాల్. దేశవాళీ టోర్నీలో అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్‌సెంచరీ, సెంచరీ చేసిన తొలి ప్లేయర్ మాత్రం యశస్వినే.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్సలో 484 పరుగులు చేసి ఆలౌట్ అయింది. యశస్వి డబుల్ సెంచరీతో పాటు అభిమన్యు ఈశ్వరన్ 154 పరుగులతో రాణించాడు. మధ్య ప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ 294 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. యశ్ దూబే 109 పరుగులు చేసి సెంచరీతో రాణించినా మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఇక 190 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. ఆట నాలుగో రోజు లంచ్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ప్రస్తుతం రెస్ట్ ఆఫ్ ఇండియా లీడ్ 391 రన్స్‌కు చేరింది. జైస్వాల్ 121 రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో యశస్వి బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yashasvi Jaiswal is the first batter to record a double hundred and a hundred in the same Irani Cup match.
He is also only the second player after Shikhar Dhawan to score more than 300 runs in one Irani Cup game.
© Lalith Kalidas & Hotstar#CricketTwitter #IraniTrophy pic.twitter.com/jQyiIzc0zG
— Indian Domestic Cricket Forum – IDCF (@IDCForum) March 4, 2023
Take a bow, Yashasvi Jaiswal. 🤌💗pic.twitter.com/xa5ph9FgHB
— Rajasthan Royals (@rajasthanroyals) March 4, 2023