ఏకంగా ఐదోసారి భారత్‌ను అండర్ 19 విశ్వవిజేతగా నిలబెట్టిన యువ సారథి యశ్ ధుల్ దేశవాళీ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న అతడు 113 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి.
కాగా యశ్ ధుల్‌కు ఇదే మొదటి రంజీ మ్యాచ్ కావడం విశేషం. కాగా ఇటివల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజ్ యశ్‌ధుల్‌ను 50 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా గతంలో టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్‌కోహ్లీ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టీమిండియాకు భవిష్యత్తులో మరో విరాట్ కోహ్లీ దొరికినట్లే అని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి యశ్ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India’s U19 World Cup winning captain Yash Dhull, today, smashed a 💯 on his First Class debut 🏏
What a couple of weeks it has been for the youngster! 👏
📸: BCCI#RanjiTrophy #CricketTwitter pic.twitter.com/V0eBzvhSfB
— Sportskeeda (@Sportskeeda) February 17, 2022