టీమిండియాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయా..! అంటే అవుననే సమాధానమే విపిస్తోంది. అదే.. 'టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్'. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి రెండు టెస్టుల్లో గెలిచిన భారత్, ఫైనల్ రేసులో ఉన్నట్లే కనిపించింది. కానీ, అనూహ్యంగా మూడో టెస్టులో ఓటమిపాలయ్యాక.. టీమిండియా ఫైనల్ కు చేరుతుందా..? లేదా..? సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టీమిండియాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయా..! అంటే అవుననే సమాధానమే విపిస్తోంది. అదే.. ‘టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్’. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి రెండు టెస్టుల్లో గెలిచిన భారత్, ఫైనల్ రేసులో ఉన్నట్లే కనిపించింది. కానీ, అనూహ్యంగా మూడో టెస్టులో ఓటమిపాలయ్యాక.. టీమిండియా ఫైనల్ కు చేరుతుందా..? లేదా..? సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే.. మూడో టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకోగా, మరొక బెర్త్ మాత్రమే ఖాళీగా ఉంది. దానికి రెండు జట్ల నుంచి తీవ్ర పోటీ ఉంది. ఒకటి.. ఇండియా, మరొకటి శ్రీలంక.
మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభంకానున్న నాల్గవ టెస్టులో భారత్ విజయం సాధించినా, ‘డ్రా’తో సరిపెట్టుకున్నా ఎలాంటి సమీకరణాలు లేకుండానే ఫైనల్ చేరుతుంది. అదే ఓటమి పాలైతే.. శ్రీలంక ఓడిపోవాలని కోరుకోవడమే మనముందున్న ఏకైక మార్గం. హా.. అదేంటి..? శ్రీలంక ఓడితే మనమెలా ఫైనల్ చేరతామనే అనుమానమా..? అయితే ఈ కథనం చదివాల్సిందే మరీ.. ప్రస్తుతానికి డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్ రేసులో 68.52 విజయాలతో 148 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, 60.29 విజయాలతో 123 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఇక 53.33 విజయాలతో 64 పాయింట్లతో శ్రీలంక మూడో స్థానంలో ఉంది.
After a comprehensive nine-wicket victory over India in the third BGT Test.
Australia book their berth in the ICC World Test Championship 2023 final.#CricTracker #Australia #INDvAUS pic.twitter.com/zJYjEgWTOc
— CricTracker (@Cricketracker) March 3, 2023
పై గణాంకాలు ప్రకారం ఫైనల్ చేరే అవకాశాలు భారత్‌కే మెండుగా ఉన్నా.. ఓటమి పాలైయితే పరిస్థి ఏంటా అని అందరూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే.. నాల్గవ టెస్టులో ఇండియా ఓడినా ఫైనల్ చేరొచ్చు. కాకుంటే.. అప్పుడు న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓటమి పాలవ్వాలి. మార్చి 9 నుంచి కివీస్ గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ని శ్రీలంక క్లీన్ స్వీప్ చేస్తే.. భారత్‌ను వెనక్కు నెట్టేసి, ఫైనల్స్ చేరుకుంటుంది. అదే ఒక మ్యాచులో గెలిచి.. రెండో మ్యాచ్ ఓడినా లేదా డ్రాగా ముగిసినా.. శ్రీలంక జట్టు ఫైనల్ అవకాశం కోల్పోయినట్టే..! అంటే.. భారత్ జట్టు విన్నింగ్ శాతం పరంగా ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది.
🚨 UPDATE 🚨
Australia have qualified for the WTC 2023 final.#INDvsAUSTest #INDvAUS#INDvsAUS #AUSvIND pic.twitter.com/pzeCI93kvS
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) March 3, 2023
ఈ లెక్కన.. భారత్‌కే ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువ. అందులోనూ కివీస్ గడ్డపై సిరీస్ జరుగుతున్నందున శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడం దాదాపు అసాధ్యమే..! కావున.. టీమిండియా ఫైనల్ చేరడం దాదాపు ఖాయమే అని చెప్పుకోవచ్చు. అందునా.. ప్రస్తుతానికి 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్ ఆఖరి టెస్ట్ గెలిస్తే.. సిరీస్ వశం చేరుకోవచ్చు. లేదంటే సిరీస్ సమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, అహ్మదాబాద్ వేదిక గణాంకాలు 100 శాతం ఫలితం వచ్చేలా ఉండటంతో భారత్ గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా..! లేదా ! అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ నాలుగో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Pat Cummins and vice-captain Steve Smith will wait in England for their final battle in World Test Championship 2023.
Who will join them? India or Sri Lanka? 🤔#WTC2023 #INDvAUS pic.twitter.com/j82sc4sRjX
— CricTracker (@Cricketracker) March 3, 2023