ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఆ లోటుని తీర్చేందుకు నేనున్నాను అంటూ డబ్ల్యూటీసీ ఫైనల్ వచ్చేస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ని చూసేందుకు క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో అనగా ఈ నెల 7 న ఈ ఫైనల్ పోరులో ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలబడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా.. క్రికెట్ లో కొత్త చరిత్రను సృష్టిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య హోరా హోరీ పోరు ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫైనల్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ పెట్టేసారు. అయితే ఇప్పుడు అభిమానులకి ఒక విషయంలో ఊరట కలిగించనున్నారు. ఈ ఫైనల్ ని క్రికెట్ లవర్స్ ఫ్రీగా చూసే అవకాశం కలిపించారు. ఫ్రీగా అంటే గ్రౌండ్ లో కాదు టీవీలో.
సాధారణంగా ఇంగ్లాండ్ లో మ్యాచ్ జరుగుతుంటే.. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇందులో భాగంగానే ఈ సారి డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా స్టార్ స్పోర్ట్స్ లో జరపనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచును డీడీ స్పోర్ట్స్ ఛానెల్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దూరదర్శన స్పోర్ట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉన్న భారత్ పాకిస్థాన్ మ్యాచులని డీడీ స్పోర్ట్స్ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ను ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది డీడీ స్పోర్ట్. మ్యాచును టీవీల్లో ఫ్రీగా చూసే అవకాశం రావడం పట్ల దేశంలో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్యూ డీడీ స్పోర్ట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
𝐈𝐂𝐂 𝐖𝐨𝐫𝐥𝐝 𝐓𝐞𝐬𝐭 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩 𝐅𝐈𝐍𝐀𝐋 𝟐𝟎𝟐𝟑
🏏 𝐈𝐍𝐃𝐈𝐀 𝐯𝐬 𝐀𝐔𝐒𝐓𝐑𝐀𝐋𝐈𝐀 – 𝐓𝐡𝐞 𝐔𝐥𝐭𝐢𝐦𝐚𝐭𝐞 𝐓𝐞𝐬𝐭
🗓️ 𝟕 𝐭𝐨 𝟏𝟏 𝐉𝐮𝐧𝐞 🏟️ 𝐓𝐡𝐞 𝐎𝐯𝐚𝐥
𝐋𝐈𝐕𝐄 𝐨𝐧 𝐃𝐃 𝐒𝐩𝐨𝐫𝐭𝐬📺 (𝐃𝐃 𝐅𝐫𝐞𝐞 𝐃𝐢𝐬𝐡)#TeamIndia #INDvsAUS #WTC23 pic.twitter.com/vHc3kWkKQW
— Doordarshan Sports (@ddsportschannel) June 2, 2023