ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అంతా రెడీ అవుతోంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ కప్‌గా భావించే వరల్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ తుదిపోరులో ఎలాగైనా గెలవాలని ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి ఈ ట్రోఫీని చేజార్చుకున్న భారత్.. ఈసారి ఎలాగైనా దాన్ని ఒడిసిపట్టాలని డిసైడ్ అయింది. ఇంగ్లండ్‌లోని వాతావరణ పరిస్థితులు, పిచ్ కండీషన్స్, పేస్ అటాక్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా జట్టును అందరూ ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అయితే భారత్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని మాజీ క్రికెటర్లు అంటున్నారు. టెస్టుల్లో మ్యాచ్ గమనాన్ని మార్చడానికి ఒక్క మంచి సెషన్ చాలు అని చెబుతున్నారు.
టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు, కంగారూ పేస్ అటాక్‌కు మధ్య జరిగే యుద్ధంగా ఈ మ్యాచ్‌ను క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఒకవేళ భారత బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకుంటే ఆసీస్ పని అయిపోయినట్లేనని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. భారత్‌తో మ్యాచ్‌కు తీవ్రంగా సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా జట్టుకు మ్యాచ్‌కు ముందు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హేజల్‌వుడ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా హేజల్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్ మైకేల్ నేసర్‌ను తీసుకున్నారు. ఇక, ఇంజ్యురీ కారణంగానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్టు నుంచి తప్పుకున్న హేజల్‌వుడ్.. ఆ తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ శిబిరంలోనూ ఆలస్యంగా జాయిన్ అయ్యాడు. అతడు ఎప్పటికి ఫిట్నెస్ సాధిస్తాడనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
🚨 Josh Hazlewood ruled out of WTC Final against India.
🏃♂️ He’s been managing a left Achilles issue and a side injury he picked up during IPL.
🔄 Michael Neser has been named as replacement.#AUSvIND #WTCFinal pic.twitter.com/bYDFtAKx9E
— Cricbuzz (@cricbuzz) June 4, 2023