డబ్ల్యూటీసి ఫైనల్ మరో 2 వారాల్లో రానే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేయగా.. తాజాగా టీంఇండియా జట్టులోని కొంతమంది సభ్యులు ఈ మ్యాచ్ కోసం లండన్ చేరుకున్నారు. అయితే తాజాగా..ఈ ఫైనల్ కి సంబంధించిన ప్రైజ్ మనీ ఐసీసీ ప్రకటించేసింది.
ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ ఇండియాని ఊపేస్తోంది. దాదాపు 2 నెలలు 70 లీగ్ మ్యాచులతో లీగ్ దశ పూర్తయింది. ఇటీవలే క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచులు కూడా ఆడేశాయి. ఇక మిగిలింది రెండే మ్యాచులు. అందులో నేడు జరుగనున్న క్వాలిఫయర్ 2 కాగా మరొకటి ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫైనల్. ఈ రెండు మ్యాచులతో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తోంది. ఇక ఆ తర్వాత ఏంటి? ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ ముగిసిన మరో 10 రోజుల వ్యవధిలో భారత్ ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసి ఫైనల్ ఆడనుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫైనల్ కి సంబంధించిన ప్రైజ్ మనీ తాజాగా ఐసీసీ ప్రకటించేసింది.
డబ్ల్యూటీసి ఫైనల్ మరో 2 వారాల్లో రానే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేయగా.. తాజాగా టీంఇండియా జట్టులోని కొంతమంది సభ్యులు ఈ మ్యాచ్ కోసం లండన్ చేరుకున్నారు. ఇక ఐపీఎల్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో మిగిలిన సభ్యులు కూడా ఇంగ్లాండ్ చేరుకుంటారు. ఒవెల్ లో జూన్ 7 న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ జరుగనుంది. అయితే ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ గెలిచిన జట్టు ఏకంగా 13.2 భారీ ప్రైజ్ అందుకోనుంది. రన్నరప్ కి 6.61 కోట్లు లభించనున్నాయి. ఐపీఎల్ ద్వారా కాసుల వర్షంలో మునిగిన భారత ప్లేయర్లకు ఈ టైటిల్ గెలిస్తే మరో జాక్ పాటు ఖాయం. ఇక 2021 లో తొలిసారి ఈ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగ్గా.. కేన్ విలియంసన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు గెలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ సారైనా మన టీమిండియా ఈ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలిచి భారీ నజరానా గెలుస్తుందో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపములో తెలపండి.