టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. తనను ఓ జర్నలిస్ట్ బెదిరించాడని వాట్సాప్ చాట్ ను బయటపెట్టిన సంగతి తెలిసిందే. సాహా ఈ ఆరోపణలు చేసినప్పటికీ ఆ జర్నలిస్ట్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సాహా.. జర్నలిస్టు పేరును బహిరంగంగా చెప్పనప్పటికీ, సదరు జర్నలిస్టు మాత్రం సోషల్ మీడియాలో అసలు నిజం ఇదంటూ ఒక పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాహా ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు బీసీసీఐ ఇప్పటికే ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో బోర్డు వైస్ చైర్మన్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, కౌన్సిల్ సభ్యుడు బల్తేజ్ సింగ్ ఉన్నారు. సాహా.. తన వాదనను వినిపించడానికి విచారణ కమిటీ ముందు శనివారం(మార్చి 5) హాజరయ్యాడు. ఎట్టకేలకు ఆ జర్నలిస్ట్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన బోరియా మజుందార్ గా బయటకి వెల్లడించాడు. అయితే.. సాహా ఆరోపణలు అవాస్తవం అసలు నిజం ఇదంటూ.. సదరు జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమ మధ్య జరిగిన సంభాషణను సాహా తప్పుగా చిత్రీకరించాడని, తనపై పరువు నష్టం దావా వేస్తానని మజుందార్ పేర్కొనడం విశేషం.
There are always two sides to a story. @Wriddhipops has doctored, tampered screenshots of my WhatsApp chats which have damaged my reputation and credibility. I have requested the @BCCI for a fair hearing. My lawyers are serving @Wriddhipops a defamation notice. Let truth prevail. pic.twitter.com/XBsiFVpskl
— Boria Majumdar (@BoriaMajumdar) March 5, 2022
“ప్రతి కథకు రెండు కోణాలు ఉంటాయి. సాహా నా వాట్సాప్ చాట్‌ను తారుమారు చేసి, నా ప్రతిష్టకు, విశ్వసనీయతకు భంగం కలిగించాడు. న్యాయమైన విచారణ కోసం బీసీసీఐని అభ్యర్థించాను. నా లాయర్ సాహాకు పరువు నష్టం నోటీసు పంపుతున్నారు. న్యాయం గెలవాలి” అంటూ 9 నిమిషాల నిడివిగల వీడియోను పోస్టు చేశాడు. ట్వీట్ చేసిన 19వ తేదీన సాహాతో మాట్లాడలేదని చెప్పాడు. ఈ విషయాలన్నీ ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 13 తేదీలలో జరిగాయని, సాహా తన స్క్రీన్‌షాట్‌లో దాచిన తేదీలను కూడా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2022 మెగా వేలం సందర్భంగా తనకు, సాహా మేనేజర్‌కు మధ్య చర్చ జరిగిందని, దీనికి సంబంధించి తాను 10వ తేదీన సాహాకు సందేశాలు పంపానని’ మజుందార్ పేర్కొన్నాడు.
After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX
— Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022
ఐపీఎల్ మెగా వేలంలో వృద్ధిమాన్ సాహాను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఇంటర్వ్యూ కోసం సాహాను అడిగానని మజుందార్ పేర్కొన్నాడు. అందుకు సాహా స్పందిస్తూ.. రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉంటానని, జూమ్ లింక్‌ను పంపుతానన్నదని చెప్పుకొచ్చాడు. తరువాత తాను.. సాహాకు ఫోన్ చేసినప్పటికీ సాహా స్పందించలేదని.. ఇచ్చిన హామీని నెరవేర్చలేదని సదరు జర్నలిస్ట్ పేర్కొన్నాడు. సాహా తనకు చాలా కాలంగా తెలుసని మజుందార్ తెలిపాడు. తాజాగా..సదరు జర్నలిస్ట్ వీడియో బయటకు రావడంతో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.