సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ బ్యాటర్ స్మృతి మంధాన జూలు విదిల్చింది. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి మరో ఎండ్ బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నా తాను మాత్రం రెచ్చిపోయింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ ముందు ఊరించే లక్ష్యం నిర్ధేశించగలిగింది.
సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. ముఖ్యంగా భారత ఓపెనర్ స్మృతి మంధాన ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించింది. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి మరో ఎండ్ బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నా తాను మాత్రం రెచ్చిపోయింది. మొత్తంగా 56 బంతులు ఎదుర్కున్న మంధాన 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ మ్యాచులో గెలిస్తేనే భారత్ సెమీస్ రేసులో నిలుస్తుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు మంచి శుభారంభమే దక్కింది. స్మృతి మంధాన- షఫాలీ వర్మ జోడి తొలి వికెట్ కు 9.3 ఓవర్లలో 62 పరుగులు జోడించారు. 24 పరుగుల వద్ద షఫాలీ వర్మ డెలానీ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ (13; 20 బంతుల్లో) కడవరకు క్రీజులో ఉన్న మెరుపులు మెరిపించలేకపోయింది. మరో ఎండ్ లో ఉన్న మంధాన ప్రతి ఓవర్‌లో బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసింది.
What a knock by Smriti Mandhana – 87 (56) with 9 fours and 3 sixes. Missed out on what could’ve been her maiden T20i century, a terrific knock by Mandhana. pic.twitter.com/s8OSMdf5PN
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2023
చివరలో జెమీమా రోడ్రిగ్స్ 19(12 బంతుల్లో 3 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో లారా డెలానీ 3 వికెట్లు తీసుకోగా, ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 2, అర్లీన్ కెల్లీ ఒక వికెట్ తీసుకుంది. కాగా, గత మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియా నాలుగు పాయింట్లతో గ్రూప్-2లో రెండో స్థానంలో ఉంది. మూడు విజయాలతో ఇంగ్లండ్ టాప్ ప్లేస్ లో ఉంది.
Smriti Mandhana’s excellent knock of 87 in 56 balls helped India to post a competitive total on board in their 20 overs.
Can Ireland Women chase this down? #CricTracker #SmritiMandhana #T20WorldCup pic.twitter.com/cjb7yFjySe
— CricTracker (@Cricketracker) February 20, 2023