క్రికెట్‌లో బ్యాటర్లు బలంగా బాదితే బాల్ రాకెట్‌లా దూసుకెళ్తుంది. లేదా బౌలర్లు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో వేస్తే.. వికెట్లను గిరాటేస్తుంది. కానీ.. గాలికి బాల్ పక్కకు వెళ్లిపోవడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడండి.
క్రికెట్‌లో బౌలర్లు లైన్ తప్పితే బాల్ వైడ్‌గా వెళ్తుంది. దాంతో ప్రత్యర్థి జట్టుకు అదనపు పరుగు లభిస్తుంది. కొన్ని సార్లు ఒక్క పరుగుతో కూడా ఫలితం తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఆటలో ఒక్క పరుగు కూడా ఎంతో విలువైంది. అందుకే బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా, ఏకాగ్రతతో బౌలింగ్ వేస్తుంటారు. అయినా కూడా కొన్ని సార్లు వైడ్లు పోవడం సహజం. కానీ.. గాలి వల్ల బాల్ వైడ్‌గా వెళ్లడం బహుషా క్రికెట్‌లో ఎప్పుడూ జరిగి ఉండదేమో? ఎందుకంటే బాల్ గట్టిగా, బరువుగానే ఉంటుంది. గాలి వీస్తున్న వైపు బాల్ ఇంకాస్త వేగంగా వెళ్తుందేమో కానీ.. పూర్తిగా గాలికి కొట్టుకుపోవడం ఎప్పుడూ జరగలేదు.
క్రికెట్ చరిత్రలో తొలి సారి బలంగా వీస్తున్న గాలికి బాల్ వైడ్ వెళ్లింది. అంది కూడా శ్రీలంక-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌లో. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. బాల్ గాలికి వైడ్ పోయింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య విల్లింగ్టన్‌లో జరిగిన రెండో టెస్టులో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ బ్రేస్‌వెల్ వేసిన ఓవర్‌లో ఓ బంతి గాలికి వైడ్‌గా వెళ్లింది. దానికి బ్యాటర్‌తో పాటు బౌలర్, ఫీల్డిర్లు కూడా షాక్ అయ్యారు. బాల్‌కు ఇంత టర్న్ లభిస్తుందని భయపడ్డారు. కానీ.. అది గాలికి అలా వెళ్లింది.
అయితే.. టెస్టుల్లో వైడ్లు ఎక్కువగా ఇవ్వరు కనుకా.. దాన్ని కూడా అంపైర్ వైడ్ బాల్‌గా ప్రకటించలేదు. అయితే.. వాతావరణం మారడంతో న్యూజిలాండ్‌లో అప్పుడప్పుడు భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. ఆ క్రమంలోనే రెండో టెస్టు సందర్భంగా భారీగా ఈదురుగాలులు వీచాయి. వాటికి బాల్ సైతం పక్కకు కొట్టుకుపోయింది. ప్రస్తుతం బాల్ అలా గాలికి పక్కకు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘యో.. ఇదేందయ్యా ఇదే. ఇది నేనెప్పుడూ సూడ్లే’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 20, 2023