ఐపీఎల్ 2022 మెగా వేలంలో పలువురు సీనియర్లని తీసుకోవడానికి ప్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడం మనందరికీ తెలిసిన విషయమే. వీరిలో.. మిస్టర్ ఐపీఎల్ గా పేరొందిన సురేష్ రైనా, స్పీడ్ స్టర్ శ్రీశాంత్ లపై ప్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసిందని అని చెప్పవచ్చు. ఈ క్రమంలో సురేష్ రైనాను తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ , శ్రీశాంత్ ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్-2022కు దూరమవునున్నాడు.
ఈ క్రమంలో దీపక్ చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు సరైన ఆటగాడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం(సీఎస్కే) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ సరైన వాడిగా భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్‌తో చాహర్ స్థానాన్ని భర్తీ చేయాలని చెన్నై భావిస్తోంది అన్నది ఆ వార్త సారాంశం. కాగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రీశాంత్ ని.. ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా శ్రీశాంత్ మిగిలిపోయాడు. ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తూ నిషేధాన్ని తగ్గించాల్సిందిగా ఆదేశాలివ్వడం జరిగింది. దీంతో బీసీసీఐ శ్రీశాంత్‌పై విధించిన శిక్షా కాలాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. నిషేధం అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయహాజారే టోర్నీ, రంజీ ట్రోఫీల్లో కేరళ తరపున శ్రీశాంత్ ఆడుతున్నాడు. రంజీట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. శ్రీశాంత్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అంతేకాకుండా.. పవర్‌ప్లేలో కూడా బౌలింగ్ చేసే సత్తా శ్రీశాంత్‌కు కలదు. ఈ కారణాలతోనే చెన్నై శ్రీశాంత్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Now that’s my 1st wicket after 9 long years..gods grace I was just over joyed and giving my Pranaam to the wicket ..❤️❤️❤️❤️❤️❤️❤️ #grateful #cricket #ketalacricket #bcci #india #Priceless pic.twitter.com/53JkZVUhoG
— Sreesanth (@sreesanth36) March 2, 2022