ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో తొలి సెంచరీ నమోదైంది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, సదరన్ బ్రేవ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ దేశవాళీ ఆటగాడు విల్ స్మీడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 101 పరుగులు చేసి ది హండ్రెడ్ లీగ్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు.
ఓవర్‌కు ఆరు బంతులు కాకుండా… ఇన్నింగ్స్‌కు 100 బంతుల చొప్పున ఆడే ఈ కొత్త ఫార్మాట్‌ను 2021లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టింది. ఇందులో ఒక బౌలర్ ఐదు బంతుల చొప్పున వేస్తారు. ఈ ఫార్మాట్ మొదలైన రెండో సీజన్‌లో తొలి సెంచరీ నమోదు కావడం, అది కూడా ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. విల్ స్మీడ్ సెంచరీతో చెలరేగడంతో బర్మింగ్‌హామ్ భారీ స్కోర్ సాధించింది.
లక్ష్యఛేదనలో సదరన్ బ్రేవ్ తడబడింది. 85 బంతుల్లో కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్ డేవిస్ ఒక్కడే 33 పరుగులతో రాణించాడు. ఈ జట్టులో క్వింటన్ డికాక్, స్టోయినీస్, టిమ్ డేవిడ్ లాంటి స్టార్లు ఉన్నా.. 53 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి సదరన్ బ్రేవ్‌పై ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన విల్ స్మీడ్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
FIRST 💯 IN #TheHundred!!!
Well played, @will_smeed 💥 pic.twitter.com/f7lnTzOYx1
— The Hundred (@thehundred) August 10, 2022
THE FIRST EVER HUNDRED IN THE HUNDRED! 💯
Will Smeed, take a bow! 🙌 #TheHundred
— ESPNcricinfo (@ESPNcricinfo) August 10, 2022
HISTORY MAKER!!! 🤯
Will Smeed take a bow 👏 pic.twitter.com/w1vztnUnOQ
— Sky Sports Cricket (@SkyCricket) August 10, 2022
ఇది కూడా చదవండి: పాకిస్తాన్ తో తలపడే భారత జట్టు ఇదే: మాజీ క్రికెటర్