ఐపీఎల్ 2023 తరువాత ధోనీ రిటైర్ అవుతాడా..? అవ్వడా..? ఈ ప్రశ్న మీ మదిలో తట్టిందా! అయితే, అందుకు సమాధానం దొరికింది. కృత్రిమ మీద చాట్ జీపీటీ ధోనీ రిటైర్మెంట్ పై తనదైన శైలిలో స్పందించింది. ఏం చెప్పిందో తెలుసుకుంటే.. ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది.
‘చాట్ జీపీటీ‘ గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బోలెడు చర్చ జరుగుతోంది. దీని దెబ్బకు ఎందరి ఉద్యోగాలు ఊడతాయో అని భయపడేవారు కొందరైతే, ఇది రానున్న రోజుల్లో రోబో సినిమాలో ‘చిట్టీ’ క్యారెక్టర్ లా మారుతుందేమో అని భయపడేవారు మరికొందరు. అడిగిన సమాచారాన్ని కచ్చితత్వంతో సమాధానం ఇవ్వడం దీని స్పెషాలిటీ. తప్పుగా అడిగారో.. తప్పనీ చెప్తోంది. దీన్ని పరీక్షించడానికి ఒకరు.. ధోనీ రిటైర్మెంట్ పై ప్రశ్నలు సంధించాడు. దీనికి చాట్ జీపీటీ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది.
2014లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ.. 2020 వరకు వన్డే, టీ20 జట్టులో కొనసాగాడు. ఆపై 2020, ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పనుకుంటున్నట్లు ప్రకటన చేశాడు. అప్పటి నుండి ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-16 సీజన్ ధోనీకి చివరిదని, ఈ మెగా టోర్నీ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కెప్టెన్ కూల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇది అవాస్తవం అన్నది కొట్టిపారేయాలం. ఈ విషయపై చాట్ జీపీటీని అడగ్గా అది ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
MS Dhoni and Ravindra Jadeja in today’s practice session ahead of IPL 2023 – The beautiful bond of Dhoni and Jadeja.pic.twitter.com/nunJYLMBRY
— CricketMAN2 (@ImTanujSingh) March 23, 2023
“రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం.. ధోని విషయంలో కూడా అంతే.. నా వద్ద ధోనీకి సంబంధించిన అంతర్గత సమాచారం గానీ, అతడి వ్యక్తిగత ఆలోచనలు, ప్రణాళికలకు సంబంధించిన సమాచారం కానీ లేదు. అందువల్ల, ధోనీ ‘ఐపీఎల్ 2023’ తర్వాత రిటైర్ అవుతాడో.. లేదో.. నేను కచ్చితంగా అంచనా వేయలేను. ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలా.. వద్దా అనేది.. అతడి ఫిట్‌నెస్, ఫామ్.. వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగానే అతడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంలో నేను కచ్చితమైన సమాధానం ఇవ్వలేను. కానీ, ఈ సమాచారం మీరు ఓ అంచనాకు రావడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా.. ” అంటూ చాట్‌జీపీటీ విశ్లేషకుల మాటలవలే తప్పించుకునే సమాధానమిచ్చింది.
అచ్చం మనిషిలా ఆలోచిస్తూ, ఖచ్చితత్వంతో సమాధానాలు ఇస్తున్న చాట్ జీపీటీని ఆదరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆన్ లైన్ లో ఓనమాలు నేర్పిన గూగుల్ ని సైతం పక్కన పెడుతున్నారు. ఈ కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ గతేడాది నవంబర్‌లోనే విడుదలైంది. దీనిపై ఎవరికీ హక్కుల్లేకపోవడం విశేషం. ఓపెన్‌ఏఐ.కామ్ అన్న వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుని మీరూ దీంతో సంభాషించవచ్చు. ఆవకాయ నుంచి అణ్వాస్త్రాల వరకు, స్టాక్ మార్కెట్ నుంచి ఖగోళపు అంచుల వరకూ ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చు. కావున మీరు కూడా ఈ కృత్రిమ మేధని ఓసారి ప్రశ్నించి చూడండి. ఎలాంటి సమాధానాలు ఇస్తుందో.. మాతో పంచుకోండి. ఐపీఎల్ 2023 తరువాత ధోనీ రిటైర్ అవుతాడా? అవ్వడా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Thala Dhoni playing scoop shot 😍#MSDhoni #IPL2023pic.twitter.com/rvwjdUt0T1
— Shivam Jaiswal 🇮🇳 (@7jaiswalshivam) March 25, 2023