ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. ఓవైపు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, మరోవైపు బిగ్ బాష్ లీగ్ లతో పాటుగా తొలి సారి సౌతాఫ్రికా సైతం టీ20 లీగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ లీగ్ ల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఓ వైపు బౌలర్లు, మరోవైపు బ్యాటర్లు తమ సత్తా నిరూపించుకుంటున్నారు. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లుగా ఫీల్డర్లు సైతం కళ్లు చెదిరే క్యాచ్ లతో ఈ లీగ్స్ లో దుమ్మురేపుతున్నారు. తాజాగా జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన సౌతాఫ్రికా లీగ్ లో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు ఓ ఫీల్డర్ ప్రస్తుతం ఈ క్యాచ్ పట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా జోహన్నెస్ బర్గ్ వేదికగా.. జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ల్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ నమోదు అయ్యింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఈ అద్భుత దృశ్యం ఆవిషృతం అయ్యింది. సూపర్ కింగ్స్ బ్యాటర్ గెరాల్డ్ కోయోట్జీ స్ట్రైకింగ్ లో ఉండగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు ఇథాన్ బోచ్.. ఈ ఓవర్ నాలుగవ బంతిని భారీ షాట్ కొట్టాడు కోయోట్జీ. అందరు ఆ బాల్ ను సిక్సర్ అనే అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఫీల్డర్ కూడా లేడు. అయితే జెట్ స్పీడ్ లో అక్కడి పరిగెడుతూ వచ్చాడు ఫీల్డర్ విల్ జాక్స్. ఒంటిచేత్తో సిక్సర్ వెళ్లే బంతిని ఒడిసిపట్టుకున్నాడు. అసాధ్యం అనుకున్న క్యాచ్ ను ఒంటి చేత్తో పట్టడంతో కంగుతిన్నాడు కొయోట్జీ. ఈ క్యాచ్ ను చూసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దాంతో సోషల్ మీడియా వేదికగా విల్ జాక్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు క్రికెట్ అభిమానులు. జాంటీ రోడ్స్ ను తలపించావ్ బ్రో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. జట్టులో ల్యూస్ డు ప్లూయ్ 40 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్ లతో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతావారిలో హెడ్రిక్స్(45), డు ప్లెసిస్(27) పరుగులు చేశారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. దాంతో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. జట్టులో ఫిలిఫ్ సాల్ట్ చేసిన 29 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం.
Now THAT Will Jacks’ stunning one-hander deserves a share of Betway’s Catch a R2 Million! 😎#Betway #SA20 | @Betway_India #JSKvPC pic.twitter.com/0A0fwnSjJY
— Betway SA20 (@SA20_League) January 17, 2023