టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్‌ఖాన్ జట్టులో వికెట్ టేకింగ్ బౌలర్‌గా ఉండేవాడు. కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీస్తూ.. జట్టుకు అవసరమైన సమయంలో బ్రేక్ త్రూలు అందించే బౌలర్‌గా జహీర్‌కు పేరుంది. అలాగే డెత్ ఓవర్స్‌లో జహీర్ ఖాన్‌ను ఎదుర్కొవాలంటే ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టేవి. తక్కువ పరుగులున్నా.. డిఫెండ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
జహీర్ ఖాన్ 2015 అక్టోబర్ 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత జట్టులో అలాంటి బౌలర్ లోటు ఉండిపోయింది. బుమ్రా, షమీ, భువనేశ్వర్‌కుమార్ లాంటి మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు ఉన్నా.. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ లేడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా మంది హేమాహేమీ బ్యాటర్లు సైతం ఎడమచేతి వాటం బౌలర్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ.. వికెట్లు తీయగల బౌలర్‌గా జహీర్ ఖాన్ ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత జహీర్‌లేని లోటు స్పష్టంగా కనిపించింది.
ఇప్పుడు యువ బౌలర్ అర్షదీప్ సింగ్ రూపంలో టీమిండియాకు మరో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ దొరికాడు. జహీర్ స్థానాన్ని భరీ చేయగల బౌలర్‌గా అర్షదీప్ ఇప్పటికే తన ప్రదర్శనతో ఆశలు రేపుతున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న అర్షదీప్ డెత్ ఓవర్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో 17వ ఓవర్ వేసి 4, 19వ ఓవర్ వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే రెండో టీ20లో 17వ ఓవర్‌లో 4, 19వ ఓవర్‌లో 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక మంగళవారం జరిగిన మూడో టీ20లో 18వ ఓవర్‌లో 5 పరుగులు, చివరి ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చి.. ప్రత్యర్థికి డెత్ ఓవర్స్‌లో చుక్కలు చూపించాడు.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడే అర్షదీప్ రెండేళ్ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియాలో చోటు దక్కించుకున్న అర్షదీప్ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ.. జట్టులో కీ బౌలర్‌గా ఎదుగుతున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో జహీర్ ఖాన్ ప్లే చేసిన కీ రోల్‌ను రానున్న టీ20 వరల్డ్ కప్ 2022లో అర్షదీప్ కూడా అలాంటి రోల్‌ను ప్లేచేస్తే.. భారత్ ఖాతాలో మరో వరల్డ్ కప్ చేరడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Arshdeep Singh has the potential to lead the pace attack in the absence of Shami,Bumrah and Bhuvi.pic.twitter.com/nqNjUFpLNt
— CRICKET VIDEOS🏏 (@Abdullah__Neaz) August 2, 2022
My fav bowler of all time @ImZaheer short video of @cricketworldcup 2011 he took 21 wicket’s. pic.twitter.com/lFf1bH9fbw
— Yasir (@yasirbdn) July 28, 2022
ఇది కూడా చదవండి: ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్ లో వింత! ఒకే జెర్సీలో ముగ్గురు ప్లేయర్స్!