ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మూడు గోల్డెన్ డక్స్‌తో అత్యంత చెత్త రికార్డు సృష్టించాడు. దీంతో.. అసలు సూర్య వన్డే టీమ్‌లో అవసరమా? అనే ప్రశ్న తలెత్తోంది. మరి నిజంగానే సూర్య అవసరం వన్డే టీమ్‌కు లేదా?
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు ఇండియా వచ్చిన ఆస్ట్రేలియా విజయానందంతో పర్యటనను ముగించింది. బుధవారం చెన్నై వేదికగా జరిగిన చివరిదైన మూడో వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా 2-1తో భారత్‌పై సిరీస్ గెలిచింది. అంతకుముందు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-2తో ఓడినా.. మూడో టెస్టులో విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. మొత్తానికి భారత పర్యటనను ఆస్ట్రేలియా సంతృప్తికరంగానే ముగించింది. టెస్టు సిరీస్‌లో ఎదురైన ఓటమితో డీలా పడిపోకుండా వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా పుంజుకున్న తీరును కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. పటిష్టమైన టీమిండియాను భారత్‌లోనే ఓడించడం గొప్ప విషయమే. అయితే.. ఇదంతా ఆస్ట్రేలియా ఆట వల్లే సాధ్యమైందా? అంటే ఆలోచించాల్సిన విషయమే. ఇది ఆస్ట్రేలియా విజయం కంటే.. టీమిండియా వైఫల్యం అనడం ఉత్తమం.
మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా బౌలింగ్ విభాగంలోనే కాస్త పర్వాలేదు అనిపించింది. బ్యాటింగ్‌లో అయితే.. మరీ పసికూనను తలపించింది. తొలి వన్డేలో కూడా ఓటమి అంచలకు వెళ్లి కేఎల్ రాహుల్, జడేజా రాణించడంతో గెలిచింది. లేదంటే ఆస్ట్రేలియా చేతిలో మనకు క్లీన్ స్వీప్ అయ్యేదే. కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలం అయ్యారు. చివరి వన్డేలో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించినా.. కోహ్లీ స్థాయి బ్యాటింగ్ అది కాదు. కోహ్లీ అంటే ఛేజ్ మాస్టర్. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కూడా టీమిండియా ఓడిపోయిందంటే కోహ్లీ తన పాత్రను సరిగా పోషించలేదనే అర్థం. ఇక మరో ప్రధానమైన సమస్య సూర్యకుమార్ యాదవ్.
ఈ సిరీస్‌లో టీమిండియాకు అది పెద్ద మైనస్ ఏంటంటే అది సూర్యకుమార్ యాదవ్. మూడు మ్యాచ్‌ల్లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై గోల్డెన్ డక్స్‌లో హ్యాట్రిక్ క్రియేట్ చేసిన తొలి బ్యాటర్‌గా సూర్య చెత్త రికార్డు సృష్టించాడు. సచిన్ కూడా వరుసగా మూడు వన్డేల్లో డకౌట్ అవుట్ అయినా.. రెండో బంతికి అవుట్ అయ్యాడు. కానీ, సూర్య మాత్రం మూడు మ్యాచ్‌ల్లోనూ తొలి బంతికే అవుట్ అయ్యాడు. అయితే.. ఇక్కడ సూర్యకు టాలెంట్ లేదని, అతను జట్టులో వేస్ట్ అని అనడం లేదు. అతని సామర్థ్యం, బలం ఏంటో గుర్తించమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్. ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్. టీ20 క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న క్రమంలో ఒక భారత బ్యాటర్ వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్నాడంటే కచ్చితంగా పెద్ద విషయమే. అలాంటి ప్లేయర్‌ను బలవంతంగా వన్డేలు ఆడిస్తూ.. అతనికి కెరీర్ మొత్తాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు.
ఈ వన్డేలో సిరీస్‌లో దారుణ వైఫల్యంతో సూర్య ఆత్మవిశ్వాసం కోల్పోయి.. అతని టీ20 బ్యాటింగ్ కూడా దెబ్బ తింటే అందుకు బాధ్యత ఎవరిది? ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023లో సూర్యను ఆడించలనే ఉద్దేశంతో అతనికి వన్డేల్లో అవకాశం ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. కానీ, ఒక పక్కా టీ20 బ్యాటర్‌ను అంత బలవంతంగా వన్డేల్లో ఆడించాల్సిన అవసరం ఏంటి? మిడిల్ ఆర్డర్‌లో సంజు శాంసన్ లాంటి యువ క్రికెటర్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతన్ని పక్కనపెట్టి.. సూర్యను బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేయడం వృథా ప్రయాస. ఇప్పటికైనా సూర్య బలాన్ని గుర్తించి అతన్ని టీ20లకు పరిమితం చేసి.. వన్డేలకు తగ్గట్లు ఆడే సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు అవకాశాలు కల్పిస్తే.. మంచి ఫలితాలు ఉంటాయని క్రికెట్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ కోసమని సూర్య కెరీర్‌ను నాశనం చేయొద్దంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Suryakumar Yadav will comeback stronger 👍 pic.twitter.com/IHyRAXpzTL
— CricTracker (@Cricketracker) March 22, 2023