‘ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ‘.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందరకి తెలిసిందే. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర రూ.216 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతానికి సుశాంత్ స్వర్గుస్తులైనప్పటికీ.. భారతీయుల హృదయాల్లో నిలిచే ఉండేలా ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. అసలు ఈ సినిమా తీయాలన్నా ఆలోచన నీరజ్ పాండేకు ఎలా తట్టింది? అందులోనూ రిటైర్మెంట్ ప్రకటించకుండానే.. బయోపిక్ తీయడానికి ధోనీ ఎందుకు ఒప్పుకున్నాడు? వంటి ఎన్నో విషయాలను దర్శకుడు పంచుకున్నాడు.
సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ గా, సబ్యాటర్ గా, మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా, ఎలాంటి పరిస్థితులను అయినా కూల్ గా హ్యాండిల్ చేసే సారథిగా ధోని మనకు తెలుసు. ఇదంతా నాణేనికి ఒక వైపు.. మనకు తెలియని ధోనీ జీవితం ఎంతో ఆసక్తికరం. రాంచీలో ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోనీ.. ఇంటర్నేషనల్ క్రికెటర్ గా, టీమిండియా సారధిగా ఎదిగాడు. క్రికెటర్ బయోపిక్ తీస్తే జనాలు చూడరా! అన్న సందేహం మీకు కలగొచ్చు. సచిన్ టెండూల్కర్ బయోపిక్ ‘200 నాటౌట్’, కపిల్ దేవ్ బయోపిక్ ’83’, మిథాలీరాజ్ బయోపిక్ ‘శభాష్ మిథాలీ’ సినిమాలను పట్టించుకోని జనాలు, ఎక్కడో జార్ఖండ్‌లో పుట్టి రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేసి.. టీమిండియా కెప్టెన్‌గా రెండు వరల్డ్ కప్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ కథకు బాగా కనెక్ట్ అయిపోయారు.
సినిమా విజవంతమైనప్పటికీ.. నీరజ్ పాండేకు ఈ సినిమాను తీయడానికి నాలుగేళ్లు పట్టిందట. అందులోనూ ధోనీని ఒప్పించడానికి రెండేళ్లు పట్టిందట. అవి అతని మాటల్లోనే.. “2007 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఎంఎస్ ధోనీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ధోనీ.. ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చాడని తెలిసి, అతని కథ తెలుసుకున్నా. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచే ప్రయాణం తనది అనిపించింది. అలాంటి సమయంలోనే.. 2015లో ధోనీ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు ఓ పిల్లాడు తన దగ్గరికి వచ్చాడు. తాను పై చదువులకు ప్రిపేర్ అవుతున్నానని, తనకు మోటివేషన్ ఇవ్వాల్సిందిగా ధోనీని అడిగాడు. వెంటనే మహీ.. అతడిని పక్కన కుర్చోబెట్టుకొని తనడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు”.
“ఆ సమయంలో నేను అక్కడే ఉన్నా. ఆ పిల్లాడు వెళ్లిపోయాక ” మహీ.. ఆ పిల్లాడితో ఇంత సమయం గడపడం అవసరమా?” అని అడిగా.. దానికి ధోనీ.. “నా సమాధానాలు అతనికి స్ఫూర్తి కలిగిస్తాయంటే దానికంటేనా..” అంటూ చెప్పాడు. అప్పుడు ధోనీకి ఈ మాట చెప్పా. “నీ కథ ఇలా ఎందరో కుర్రాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అలా అని కొన్ని లక్షలమంది పిల్లల దగ్గర కూర్చొని నువ్ మోటివేట్ చేయలేవు” అందుకు ఒకటే పరిష్కారం నీ బయోపిక్ తీయడమని చెప్పాను. అందుకు ధోనీ వెంటనే ఒకే చెప్పాడు. అలా ఒప్పుకున్నాక కథను డెవలప్ చేయడానికి నాకు నాలుగేళ్లు పట్టింది..” అని ‘ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా దర్శకుడు, రచయిత నీరజ్ పాండే ఈ సినిమా తీయడానికి కారణమైన విషయాలన్నింటిని చెప్పుకొచ్చాడు.