లక్కీ కెప్టెన్, కనిపించడు కానీ టీమ్‌లో రాజకీయాలు చేస్తాడు, టీమ్ బాగుండి గెలిచింది.. కెప్టెన్‌గా అతను చేసింది ఏం లేదు, లక్కు కొద్ది కెప్టెన్ అయ్యాడు, సీనియర్లను సరిగా గౌరవించలేదు, చివర్లో వచ్చి క్రెడిట్ దొబ్బేస్తాడు. ఇవి.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని హేటర్స్ చెప్పే మాటలు. ధోనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో.. అదే స్థాయిలో అతనిపై విమర్శలు గుప్పించే వారు కూడా ఉన్నారు. ఇండియన్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనిని అతని రికార్డులే నిలబెడుతున్నాయి. కానీ.. విమర్శలకు సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నాయి. ఎందుకంటే ధోని చేసే మంచి ఎవరికి కనిపించదు కనుక. ధోని గోప్యంగా ఉంచే అతని గొప్పతనమే ద్వేషించే వారికి ఆయుధంగా మారింది. ఇదే విషయం విరాట్ కోహ్లీ 71వ సెంచరీతో మరోసారి స్పష్టమైంది.
విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడం లేదని అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. జట్టుకు భారంగా మారాడని, ఇక రిటైర్మెంట్‌కు టైమ్ వచ్చిందంటూ దారుణంగా తిట్టిపోశారు. మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ ఫామ్‌పై బహిరంగంగానే విమర్శల వర్షం కురిపించారు. వాటన్నింటిని భరిస్తూ.. ఆసియా కప్ 2022లో విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. రెండు హాఫ్ సెంచరీలకు తోడు అఫ్ఘనిస్థాన్‌పై అద్భుత సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. చాలా రోజులుగా సెంచరీ.. సెంచరీ అని మొత్తుకుంటున్న వారికి తాను సెంచరీ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. దీంతో కోహ్లీపై ప్రశంసల వర్షం మొదలైంది. ఫామ్‌లో లేడని విమర్శించిన వారు సైతం ఓహో కోహ్లీ.. ఆహా కోహ్లీ అంటూ పొగడ్తలతో మొంచెత్తారు. కానీ.. ధోని మాత్రం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో ధోని హేటర్స్‌కు మళ్లీ పని దొరికింది. కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు, ధోనిని అన్నలా భావించే వ్యక్తి తిరిగి ఫామ్‌లోకి వచ్చి.. భారీ సెంచరీ బాదితే కనీసం ప్రశంసిస్తూనో, కంట్రాగ్స్ చెప్తునో ఒక్క ట్వీట్ కూడా చేయలేదంటూ ధోనిపై విమర్శలు గుప్పించారు.
ఇక్కడే వారికి ధోని గొప్పతనం తెలియాల్సింది. ఒక వ్యక్తి సక్సెస్ సాధిస్తే అతన్ని అడ్డంపెట్టుకుని వార్తల్లో నిలిచే క్యారెక్టర్ ధోనిది కాదు. మ్యాచ్ ఓడితే విలేకర్ల సమావేశానికి తానోచ్చి.. గెలిస్తే మంచి ప్రదర్శన చేసిన ప్లేయర్‌ను పంపే గొప్ప వ్యక్తిత్వం ధోనిది. కెప్టెన్‌గా ఏ కప్ గెలిచినా.. జట్టులోని కుర్రాళ్ల చేతుల్లో పెట్టేసి ఒక్కడో ఒక మూలన వెళ్లి నిల్చునే నిస్వార్థ నాయకుడు. హంగు ఆర్భాటం లేకుండా గొప్ప కెరీర్‌ను ముగించిన కీర్తి ఖండూతి లేని లీడర్. అలాంటి ధోని.. కోహ్లీ 71వ సెంచరీపై ఎందుకు స్పందించలేదో అర్థం చేసుకోవాలంటే.. 71వ సెంచరీకి ముందు పాక్‌పై హాఫ్ సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. టెస్టు కెప్టెన్సీ నుంచి తాను తప్పుకున్నప్పుడు ధోని ఒక్కడే తనకు మేసేజ్ చేశాడని.. చాలా మంది టీవీల్లో ఉచిత సలహాలు ఇచ్చారు కానీ.. ధోని ఒక్కడే నా సక్సెస్‌ను నిజాయితీ కాంక్షించాడని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది ఏంటంటే.. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా, పది మందికి తెలిసేలా కాకుండా గోప్యంగా నిలబడ్డం గొప్ప విషయం ఆ పని ధోని చేసి చూపించాడు.
ఇక ఒక వ్యక్తి సక్సెస్ సాధించిన తర్వాత ప్రశంసించడం, పొగడ్తలతో ముంచేయడం అతి సామన్యమైన విషయం. అది ధోని లాంటి వ్యక్తులకు అలవాటు లేని పని. బాగున్నప్పుడు కాదు.. కష్టల్లో ఉన్నప్పుడు తోడు నిలబడ్డమే గొప్ప విషయం. అదే ధోని చేసింది.. చేస్తుంది.. చేయబోయేది. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. వాళ్లకు అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ధోనికి పాపులారిటీనో పబ్లిసిటీనో అవసరం లేదు. అతనికి కావాల్సింది.. తన తమ్ముడు కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం.. టీమిండియాకు విజయాలు అందించడం. అందుకే కోహ్లీ ఫామ్‌లో లేనప్పుడు అతనితో నిలబడ్డాడు.. ఫామ్‌లో వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయాడు. దటీజ్ ధోని. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఫామ్‌లోకి టీమిండియా మెయిన్ పిల్లర్లు! ఇక తిరుగుండదు..
Thank you for all the love and support throughout the Asia Cup campaign. We will get better and come back stronger. Untill next time ❤️🇮🇳 pic.twitter.com/yASQ5SbsHl
— Virat Kohli (@imVkohli) September 9, 2022
The Virat Kohli and MS Dhoni bond is of different level! pic.twitter.com/iLohIQQ3qv
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2022
Virat Kohli via press conference:
“I always have a special bond with MS Dhoni” 😍pic.twitter.com/AtQEOj7IwP
— CricTracker (@Cricketracker) September 4, 2022