మహేంద్రసింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్‌లో బిగ్‌స్టార్. 28 ఏళ్ల తర్వాత భారత్‌ను విశ్వవిజేతగా నిలపడంతో పాటు రెండు వరల్డ్ కప్‌లు అందించిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. కోట్లలో అభిమానులు ఉన్న ఆటగాడు. కానీ.. తన జట్టులోని స్టార్ ప్లేయర్ గౌతమ్ గంభీర్‌కు మాత్రం ధోని అస్సలు నచ్చడు. ధోని కెప్టెన్‌గా గెలిచిన రెండు వరల్డ్ కప్ ఫైనల్స్‌లోనూ గంభీరే టాప్ స్కోరర్. కానీ.. ధోనికి దక్కినంత గుర్తింపు అతనికి దక్కలేదు. టీమిండియాను ధోని ఏలుతున్న సమయంలోనే జట్టులో ఉంటూనే కెప్టెన్ ధోనిని విమర్శించిన గట్టోడు గౌతమ్ గంభీర్. అసలు ధోని అంటే గంభీర్‌కు ఎందుకుపడదు. ధోని చేసిన ఏ పని గంభీర్‌కు కోపం తెప్పించింది. ఆ తర్వాత ధోనిని గంభీర్ ఏ విధంగా టార్గెట్ చేశాడో ఇప్పుడు ఒక సారి క్లియర్‌గా తెలుసుకుందాం.
2012 ఫిబ్రవరీ 12, భారత్-ఆస్ట్రేలియా మధ్య అడిలైట్ వేదికగా నాలుగో వన్డే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగుల చేసి భారత్‌కు ఒక మంచి టార్గెట్ ఇచ్చింది. ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమైన దశలో ధోని మ్యాచ్‌ను గెలిపిస్తాడు. మ్యాచ్ అనంతరం 92 పరుగులతో మంచి ప్రదర్శన కనబర్చిన గౌతమ్ గంభీర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభిస్తుంది. ఈ అవార్డు తీసుకునే క్రమంలో ఈ థ్రిల్లింగ్ విక్టరీపై మీ ఫీలింగ్ ఏంటని వ్యాఖ్యత అడిగి ప్రశ్నకు గంభీర ఊహించని సమాధానం ఇచ్చాడు. నిజానికి సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను ధోని చివరి వరకు తీసుకొచ్చాడని. తాను అవుట్ అయ్యే సరికి బాల్ టూ బాల్ రన్స్ మాత్రమే అవసరమైనా.. జిడ్డూ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను లాస్ట్ ఓవర్ వరకు లాక్కొచ్చి గెలిపించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆ మ్యాచ్‌లో ధోని 58 బంతులు ఆడి 44 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో కేవలం ఒక ఒకే ఒక సిక్స్ ఉంది. మిగతా 38 పరుగులు సింగిల్స్, డబుల్స్‌తోనే వచ్చాయి. గంభీర్ అవుట్ అయ్యే సరికి టీమిండియా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 178 పరుగులు చేసేసింది. అప్పుడు టీమిండియా విజయానికి 95 బంతుల్లో 92 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నా.. ధోని అనవసరంగా జిడ్డు బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను చివరి వరకు తీసుకొచ్చి.. అనవసరపు టెన్షన్ క్రియేట్ చేసి లాస్ట్ ఓవర్‌లో ఒక సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడని, అసలు అంత నెమ్మదిగా ఆడాల్సిన అవసరం ఏంటనేది గంభీర్ ఆవేదన. నిజానికి ఆ మ్యాచ్ చూసిన వారందరికీ అదే అనిపించినా.. ధోని మ్యానియాతో గంభీర్ ఆవేదనను అర్థం చేసుకోలేకపోయారు. ఈ మ్యాచ్ నుంచి ధోని అంటే గంభీర్‌కు కోపం మొదలైంది.
ఐపీఎల్‌లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉండగా.. 2011 నుంచి 2017 వరకు గంభీర్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గంభీర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. సీఎస్‌కేపై నిషేధం విధించినప్పుడు ధోని కొత్త టీమ్ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా.. ఐపీఎల్‌లో కెప్టెన్లుగా ధోని-గంభీర్ ఎదురుపడ్డ మ్యాచ్‌ల్లో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవన్నీ ధోనిపై గంభీర్‌కు ఉన్న కోపం, చిన్న చూపు, చులకన భావాన్ని స్పష్టం చేశాయి.
తొలి సారి 2015లో సీఎస్‌కే-కేకేఆర్ మధ్య మ్యాచ్ సందర్భంగా ధోని బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో ధోని చుట్టూ నలుగురు ఫీల్డర్లను పెట్టి ఎటాకింగ్ ఫీల్డ్ సెట్ చేశాడు. అలాగే 2016లో రైజింగ్ పుణె-కేకేఆర్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ధోనికి టెస్టు స్టైల్లో ఫీల్డింగ్ సెట్ చేశాడు. అప్పట్లో ఈ ఫీల్డ్ సెట్ సంచలనం అయింది. ఐపీఎల్‌లోనే కాదు దేశవాళీ టోర్నీల్లో జార్ఖండ్-ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా కూడా ధోనికి టెస్టు ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు గంభీర్. ఈ ఫీల్డ్ సెట్‌లన్నీ గంభీర్ కావాలనే పెట్టినట్లు అందరికీ తెలిసిందే. ధోని రాగానే చాలా జిడ్డుగా ఆడతాడని, అతనికి టెస్టు ఫీల్డింగే కరెక్ట్ అని చెప్పేందుకే గంభీర్ అలాంటి ఫీల్డింగ్ సెట్ చేశాడనే చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా 2016లో ధోనికి సెట్ చేసిన టెస్టు ఫీల్డింగ్‌తో ధోని అంటే గంభీర్‌కు ఇంతకోపమా అనే విషయం క్రికెట్ ప్రపంచానికి స్పష్టమైంది.
2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఫైనల్‌లో 95, 2007లో గెలిచిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 75 పరుగులు చేసిన గంభీర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ.. ఎక్కువ క్రెడిట్ మాత్రం ధోనికే దక్కిందని చెప్పాలి. 2011 వరల్డ్ కప్ క్రెడిట్‌ను ధోని ఒక్కడికే ఇవ్వడంపై గంభీర్ బహింరంగానే అనేక సార్లు తప్పుబట్టాడు. జట్టులోని 11 మంది ఆటగాళ్ల కృషితోనే టీమిండియా వరల్డ్ కప్ నెగ్గిందని గంభీర్ పేర్కొన్నాడు. తాజాగా ధోని ఓరియో బిస్కెట్స్‌కు ప్రచారం చేస్తూ.. ఓరియో లాంచ్‌తోనే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని వ్యాఖ్యానించి విమర్శల పాలైయ్యాడు. ఈ విషయంపై కూడా పరోక్షంగా స్పందించిన గంభీర్ తన పెంపుడు కుక్కకు ఓరియో అని పిలుస్తూ.. పరోక్షంగా ధోనికి కౌంటర్ ఇచ్చాడు.
Gautam Gambhir Uploaded A Video On Instagram Calling His Dog Name Oreo. He Uploaded This Video After MS Dhoni Gave Credit To Oreo For Winning The 2011 World Cup. pic.twitter.com/D8eMvyH18A
— Duck (@DuckInCricket) September 27, 2022
Gambhir field set for Dhoni #RPSvKKR #KKRvRPS #IPL2016 #IPL9 #Dhoni #Gambhir pic.twitter.com/6PCvYKkh3a
— Mast aadmi (@MathsKaKeeda) May 14, 2016
Appatlo mari Gambhir mass field set for Dhoni #IPLT20
Best IPL troll ever pic.twitter.com/e0u3iok3jU
— Sharath Sai (@SharathsaiH) April 12, 2019
ఇది కూడా చదవండి: సినిమా హీరోల్లా మారిన కోహ్లీ-రోహిత్! పోటాపోటీగా భారీ కటౌట్లు