శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా-2022లో భారత్ జయభేరి మోగించింది. మూడు టీ20ల సిరీస్, రెండు టెస్టుల సీరిస్ ను వైట్ వాష్ చేసింది. టెస్టు సిరీస్ విషయానికి వస్తే రెండు టెస్టుల్లోనూ భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మొదటి టెస్టు మూడోరోజే ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులో 238 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రిషబ్ పంత్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. సిరీస్ పూర్తయ్యాక ట్రోఫీని కెప్టెన్ యంగ్ స్టర్స్ కు ఇస్తుంటారు. అలాగే సిరీస్ అయ్యాక కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోఫీని ఇద్దరు యువ ఆటగాళ్లకు అందించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది ఎవరు వాళ్లు అని.
ఇదీ చదవండి: IPL 2022 నిబంధనల్లో కొత్త మార్పులు!
రోహిత్ శర్మ నుంచి ట్రోఫీ అందుకున్న వాళ్లు ఎవరంటే.. ప్రియాంక్ పాంచల్, సౌరభ్ కుమార్. వాళ్లు ఎవరు? ఏ మ్యాచ్ లు ఆడారో తెలుసుకుందాం. ప్రియాంక్ పాంచల్ టీమిండియా బ్యాకప్ ఓపెనర్. హ్యామ్ స్ట్రింగ్ గాయంతో రోహిత్ శర్మ 2021-22 సౌతాఫ్రికా టూర్ నుంచి వైదొలిగిన సమయంలో అతడ్ని 31 ఏళ్ల ప్రియాంక్ పాంచల్ రీప్లేస్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ప్రియాంక్ పాంచల్ కు ఎంతో గొప్ప అనుభవం ఉంది. 101 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 45.3 సగటుతో 7,068 పరుగులు చేశాడు.
రెండో కుర్రాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భాగ్ పట్ కు చెందిన 28 ఏళ్ల సౌరభ్ కుమార్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేస్తాడు. ఉత్తరప్రదేశ్ తరఫున అండర్-19, అండర్-22 డొమెస్టిక్ క్రికెట్ మ్యాచులు ఆడాడు. 46 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 29.11 సగటుతో 1572 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, 8 అర్ధ శతకాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ కెరీర్లో సౌరభ్ కుమార్ మొత్తం 10,494 బంతులు సంధించాడు. అందులో 196 వికెట్లు పడగొట్టాడు. ఈ కుర్రాళ్ల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W
— BCCI (@BCCI) March 14, 2022