ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. క్రికెటర్స్ పై కోట్ల వర్షం కురిపించే రిచెస్ట్ లీగ్. ఆటగాడిలో సత్తా ఉంటే చాలు.. ఎన్ని కోట్లు చెల్లించడానికైనా ఇక్కడ ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది. బెంగుళూరు వేదికగా జరుగుతున్న మెగా వేలంలో ఈ ఆటగాడి కోసం కోసం అన్నీ జట్లు పోటీపడ్డాయి. చూస్తుండగానే హసరంగా ధర అమాంతం పెరుగుతూ పోయింది. చివరకి బెంగుళూరు జట్టు హసరంగాని 10.75 కోట్లుకి దక్కించుకుంది. మిచెల్ మార్స్ లాంటి మ్యాచ్ విన్నర్ కూడా ఇంత రేటు పలకలేదు. మరి.. ఇంతలా వనిందు హసరంగాపై బెంగుళూరు ఎందుకు నమ్మకం పెట్టుకున్నట్టు? అసలు హసరంగాలో ఉన్న అంతటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hasaranga all set to don the @RCBTweets jersey 😎👏#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/B8nLmkpMzs
— IndianPremierLeague (@IPL) February 12, 2022
మొదట్లో శ్రీలంక అండర్-19 జట్టులో మెరుపులు మెరిపించి.. హసరంగా జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలా 2017లో హసరంగా ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆడిన తొలి వన్డే లోనే హ్యాట్రిక్ సాధించిన అద్భుతమైన ఘనత కూడా హసరంగా సొంతం. అయితే.., లంక టీమ్ లోని అనిశ్చితి, రాజకీయాల కారణంగా హసరంగా చాలా ఏళ్ళు మళ్ళీ టీమ్ లోకి రాలేకపోయాడు. కానీ.., డొమెస్టిక్ లెవల్ లో మాత్రం తన అగ్రసివ్ ఆట తీరుతో ఆకట్టుకుంటూ వచ్చాడు. చివరకి హసరంగాని సెలెక్టర్లు మళ్ళీ జాతీయ జట్టుకి ఎంపిక చేశారు.
ఈసారి బాల్ తో మాత్రమే కాకుండా బ్యాట్ తో కూడా రెచ్చిపోయాడు హసరంగా. ముఖ్యంగా ఉపఖండం పిచ్ లపై అర్ధం కాని లెగ్ స్పిన్ వేయడంలో ఈ బౌలర్ దిట్ట. పైగా.. మిడిల్ ఆర్డర్ లో పవర్ ఫుల్ షాట్స్ ఆడగల సామర్ధ్యం ఇతని సొంతం. ఇక పాకిస్థాన్ సీరిస్ లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా నిలవడం, టీమిండియాతో జరిగిన టీ-20 మ్యాచ్ లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం హసరంగాకి కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. మరి.. హసరంగా కోసం బెంగుళూరు జట్టు ఇంత మొత్తం ఖర్చు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.