పాకిస్థాన్ తో మ్యాచ్ అనంతరం కోహ్లీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం లేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ ధోని గురించి చెప్పింది అంతా అబద్దం అని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే విరాట్ వ్యాఖ్యలపై మరో దిగ్గజ ఆటగాడు అయిన సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అసలు కోహ్లీకి కావాల్సింది ఏంటి అంటూ.. ప్రశ్నించాడు. ప్రస్తుతం విరాట్ పై సునీల్ చేసిన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ.. గతంలో ఫామ్ లో లేడని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో వాటన్నింటికి తాజాగా తన బ్యాట్ తోనే సమధానం చెప్పాడు. ఈ క్రమంలోనే పాక్ పై మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో విరాట్ .. నేను టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాక నాకు మెసేజ్ చేసిన ఒకే ఒక్కడు ధోనీ. మిగతావారి దగ్గర నా నంబర్ ఉన్నాగాని నాకు కాల్ చేయలేదు.” ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం దుమారం లేపుతున్నాయి. ఈ మాటలపై సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీపై విరుచుకు పడ్డాడు.
గవాస్కర్ మాట్లాడుతూ..” అసలు విరాట్ ఏం మెసేజ్ కోరుకుంటున్నాడు. ప్రోత్సాహాన్నా..? అతడు తన కెప్టెన్సీని అద్భుతంగా నిర్వర్తించాడు. మరి దానికి ఇంకా ఎందుకు ప్రోత్సాహాం. అది గతం ఎప్పుడో కెప్టెన్సీ విషయం ముగిసిపోయిందని” గవాస్కర్ తెలిపాడు. గవాస్కర్ మరింత లోతుగా మాట్లాడుతూ.. “విరాట్ నువ్విప్పుడు ఓ ఆటగాడివి మాత్రమే. నీ ఆట గురించి నువ్వు ఆలోచించు అంతేగాని నీకు కెప్టెన్సీ గురించి ఎందుకు? నీకు ఎవరూ మెసేజ్ చేయ్యలే అంటున్నావ్.. ఐతే 1985లో నా కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రతిష్టాత్మకమైన బెన్సన్&హెడ్జ్ వరల్డ్ ఛాంపియన్ గెలుచుకున్నాను.
ఈ విజయం తర్వాత నేను కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాను. ఆ రోజు రాత్ర మేం పార్టీ కూడా చేసుకున్నాం, అందరం ఒకరికి ఒకరం అభినందనలు తెలుపుకున్నాం. ఇలాంటిది ఏదైనా నువ్వు కావాలని కోరుకుంటున్నావా విరాట్? అంటూ ప్రశ్నించాడు. గవాస్కర్ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింతగా ముదర బోతుందా అని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి గవాస్కర్ వ్యాఖ్యలపై విరాట్ ఏవింధంగా స్పందిస్తాడో చూడాలి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.