టోక్యో ఒలంపిక్స్‌లో భాగంగా సెమీ ఫైనల్‌లో రెజ్లింగ్‌లో కజకిస్థాన్ ఆటగాడు సనయవ్ భారత రెజ్లర్ రవికుమార్ దాహియా పోటీ పడిన విషయం తెలిసిందే. అందులో భారత అథ్లటిక్ రవి కుమార్ ప్రదర్శనకు అంతా సంతోషపడ్డారు. హోరాహోరిగా సాగిన ఈ ఒలంపిక్స్‌లో చివరికి రవికుమార్ ఏకంగా రజత పతకాన్ని అందించి భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ రెజ్లింగ్ సెమీ ఫైనల్‌లో ఆడుతున్న క్రమంలో రవి కుమార్ చేయి కండరాన్ని కజకిస్థాన్ ఆటగాడు సనయవ్ గట్టిగా కొరికిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ కొరికిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో ఎంతో హల్‌చల్ చేశాయి. దీంతో రెజ్లింగ్ ఆట పూర్తైన తర్వాత సనయవ్ రవి దగ్గరకి వెళ్లటంతో రవి కౌగిలించుకున్నాడట. సనయవ్ కొరటంతో క్షమించమని అడిగేసరికి రవి కుమార్ దాహియా నవ్వుతూ మళ్లీ కౌగిలించుకున్నాడట. దీన్ని బట్టి రవికుమార్ ఎంత మంచి మనసున్న వాడో ఇట్టే అర్థమవుతోంది. ఇక ఈ ఏడాది టోక్యో ఒలంపిక్స్ వేడుకలు ఘనంగ ముగిశాయి. ఈ సారి ఈ పోటీలో భారత్‌కు గోల్డ్ మెడల్‌తో 100 ఏళ్ల కలను నెరవేర్చాడు భారత అథ్లటిక్ నీరజ్ చోప్రా. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బంగారు పతకాన్ని అందించి రికార్డ్ క్రియేట్ చేశాడు నీరజ్.