న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా వెస్టిండీస్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా.. వెస్టిండీస్ పేసర్ షమిలియా కానెల్ ఫిల్డీంగ్ చేస్తూ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలింది. ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో హుటాహుటిన ఆమెను ఫిజియోలు ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్లేయర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా షమిలియాకు అసలు ఏమైందే అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
అయితే కానెల్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని టీమ్ కెప్టెన్ స్టఫానీ టేలర్ వెల్లడించింది. తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటుందో లేదో ఇప్పుడేమీ చెప్పలేమని తెలిపింది. ‘ఆమెను అలా చూడటం కాస్త ఆందోళన కలిగించింది. ఆమె తప్పకుండా మామూలు స్థితికి తిరిగి వచ్చేస్తుందని ఆశిస్తున్నాం” అని ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ హేలే మాథ్యూస్ చెప్పుకొచ్చింది. కాగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీరేంద్ర సెహ్వాగ్ పై షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్!
West Indies star Shamilia Connell collapses during World Cup match in “worrying” sceneshttps://t.co/Li002oDBE5 pic.twitter.com/t4ZBH0koom
— Mirror Sport (@MirrorSport) March 18, 2022
My heart has restarted enough for me to tweet.
2pts in the bag✌🏼#MaroonWarriors #CWC22 #TeamWestIndies pic.twitter.com/9gPeWdQq0I
— Windies Cricket (@windiescricket) March 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.