దేశవాళీ క్రికెట్ లో రంజీ ట్రోపీకున్న ఆధరణే వేరు. ఒకరకంగా చెప్పాలంటే.. టీమిండియా క్రికెట్ కు రంజీ ట్రోఫీయే వెన్నుముక. ఇక్కడ మంచిగా రాణించిన ఆటగాళ్లకు.. జాతీయ జట్టులోకి మార్గం సుగమైనట్లే. 1934–35 సీజన్‌లో మొదలైన ఈ మెగా టోర్నీ నాటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది. కానీ.. కరోనా కారణంగా 87 ఏళ్ల తర్వాత తొలిసారిగా 2020–21 సీజన్ రంజీ ట్రోఫీ లేకుండానే ముగిసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత మొదలైన ఈ టోర్నీలో ఎన్నో రికార్డులు వచ్చి చేరుతున్నాయి. ముంబై జట్టు ఉత్తరాఖండ్ పై 725 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫస్ట్‌క్లాస్ చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పగా, జార్ఖండ్ తో జరిగిన మ్యాచులో బెంగాల్ జట్టు టాప్-9 ఆటగాళ్లు హాఫ్ సెంచరీ చేసి 129 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టారు.
రంజీ ట్రోఫీ 2021- 22 సీజన్ చివరి దశకు చేరుకుంది. బెంగాల్, మధ్యప్రదేశ్, ముంబై, ఉత్తరప్రదేశ్ జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బెంగాల్ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కాగా ఆటకు శుక్రవారం ఆఖరి రోజు కాగా.. ఫలితం వచ్చేలా కనబడకపోవడంతో గంట ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక.. మొదటి ఇన్నింగ్స్ లో 73 పరుగులు చేసిన బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో సెంచరీ మార్క్ అందుకోవడంతో పాటు.. బెంగాల్ జట్టును సెమీస్ కు చేర్చాడు.
Manoj Tiwary also scored a half-century in the first innings for Bengal followed by a century.#ManojTiwary #Bengal #RanjiTrophy #IndianCricket #Cricket #BetBarter pic.twitter.com/L4iOE2ENkP
— Bet Barter (@BetBarteronline) June 10, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli: వెకేషన్ లో అనుష్కతో ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ! ఫోటో వైరల్!
అంతకముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌ను 773 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 475 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ జట్టుకు చెందిన టాప్ 9 మంది ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేసి రంజీ ట్రోఫీలో అరుదైన రికార్డు నెలకొల్పారు.
Performance of Minister of State for Affairs of Sports and Youth : Bengal – Manoj Tiwary in 2021/22 Ranji Trophy QF vs Jharkhand
🏏73(173) – 5 fours & 2 sixes
🏏136(185) – 19 fours & 2 sixesWell Played @tiwarymanoj
📸 : 2019/20 Ranji Trophy #RanjiTrophy #CricketTwitter pic.twitter.com/0Mv6jWaXqq
— Indian Domestic Cricket Forum – IDCF (@IndianIdcf) June 10, 2022