మధుర జ్ఞాపకాలు ఎన్నిసార్లు గుర్తుచేసుకున్నా సరే అద్భుతంగానే ఉంటాయి. మనసుకు హాయినిస్తాయి. ఇక మీకు నచ్చిన మధుర స్మతుల్ని స్క్రీన్ పై చూసే అవకాశమొస్తే.. అబ్బా అని ఎగిరి గంతేస్తారు. కళ్లప్పగించి మరీ చూస్తారు. త్వరలో అదే జరగబోతోంది. ఎందుకంటే టీమిండియాకు ఎన్నో అనుభూతుల్ని మిగిల్చిన 2007 టీ20 ప్రపంచకప్ మరోసారి మన ముందుకు రాబోతుంది. ఎవర్ గ్రీన్ కాంబో ధోనీ-యువరాజ్ మరోసారి భారత క్రికెట్ ప్రేమికుల్ని మాయలో పడేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుత క్రికెట్ లో టీ20లదే హవా. జనాలు కూడా దానికి బాగా అలవాటు పడిపోయారు. అందుకే ఐపీఎల్.. ఏడాది ఏడాదికి అద్భుతమైన సక్సెస్ సాగిస్తూ దూసుకెళ్తోంది. అయితే టీ20ల్లో ఎన్ని లీగ్స్ వచ్చినా, ఎన్ని వరల్డ్ కప్స్ జరిగినా సరే 2007 టీ20 ప్రపంచకప్ మాత్రం టీమిండియా అభిమానుల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకుంది. ఎందుకంటే టీ20 ఫార్మాట్ లో ఏ జట్టుకి కూడా అప్పటికి పెద్దగా అనుభవం లేదు. అలానే అప్పటివరకు ఉన్న సీనియర్స్ కాకుండా కుర్రాళ్లతో భారత జట్టు ఈ సిరీస్ లో అడుగుపెట్టింది.
ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తూ, ఫైనల్లో దాయాది పాక్ ని మట్టికరిపించిన టీమిండియా, కప్ ఎగరేసుకుపోయింది. మెయిన్ గా ఆ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ అయితే మెమొరబుల్ ఎక్స్ పీరియెన్స్. మరోవైపు కెప్టెన్ గా అప్పుడే కెరీర్ ప్రారంభించిన ధోనీ కూడా తన స్టామినా ఏంటనేది ఒక్క టోర్నీతో ప్రూవ్ చేశాడు. దీంతో ప్రపంచం మొత్తం ధోనీ పేరు మార్మోగిపోయింది. అదే టోర్నీలో యువరాజ్.. ఇంగ్లాండ్ జట్టుపై ఒకే ఓవర్లో కొట్టిన ఆరు సిక్సుల్ని ఇప్పటికీ మర్చిపోలేం. అలాంటి అనుభూతుల్ని ఇప్పుడు స్క్రీన్ పైకి తీసుకురానున్నాడు.
2007 టీ20 ప్రపంచకప్ పై వెబ్ సిరీస్ రానుందని తాజాగా ప్రకటించారు. యూకేకు చెందిన వన్ వన్ సిక్స్ నెట్ వర్క్ దీన్ని నిర్మిస్తోంది. ఆనంద్ కుమార్ డైరెక్టర్. ఈ సిరీస్ ని పలు భాషల్లో డాక్యుమెంటరీగా తీస్తున్నారు. అంటే రియల్ ఇన్సిడెంట్స్ నే మళ్లీ మన కళ్ల ముందుకు తీసుకొస్తారు. అప్పటి జట్టులోని 15 మంది ఆటగాళ్లు, తమ అనుభవాల్ని పంచుకుంటారు. ఇప్పటికే దాదాపు రెండొంతుల షూటింగ్ కూడా పూర్తయినట్లు వెల్లడించారు. టైటిల్ ఇంకా నిర్ణయించని ఈ వెబ్ డాక్యు సిరీస్ ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని ప్రకటించారు. చూస్తుంటే.. వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది.
WEB SERIES ON 2007 T20 CRICKET WORLD CUP… A multi-language documentary web series on 2007 T20 Cricket World Cup – not titled yet – is officially announced… Featuring 15 #Indian cricketers, it is set to release in 2023… Over two-thirds of the shoot is complete. pic.twitter.com/DnF6F2JI5Y
— taran adarsh (@taran_adarsh) November 18, 2022