ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ.. ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పురుష క్రికెటర్లను, మెన్స్ టీమ్‌ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే బీసీసీఐ.. ఉమెన్స్ క్రికెట్ టీమ్‌పై మాత్రం చిన్నచూపు చూస్తోందంటూ క్రికెట్ అభిమానుల మండిపడుతున్నారు. అందుకు కారణం.. తమ టీమ్‌కు ఒక బౌలింగ్ కోచ్‌ను నియమించమని సాక్ష్యాత్తు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అభ్యర్థించడమే. ఇటివల ఆస్ట్రేలియాలపై రెండో వన్డేలో గెలిచి.. ఆసీస్ వరుస విజయాల పరంపరకు బ్రేక్ వేసిన టీమిండియా.. అందరి ప్రశంసలను అందుకుంది. కానీ.. అదో జోరు మూడో వన్డేలో కొనసాగించలేకపోయింది. దీంతో జట్టులో ఉన్న లోటుపాట్లపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గళమెత్తారు.
తమకు ఒక బౌలింగ్‌ను నియమించాలని కోరింది. ఇప్పటికే ఇండియన్ ఉమెన్స్ టీమ్ హెడ్‌కోచ్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రమేష్ పవార్‌ను బీసీసీఐ తొలగించింది. దీంతో హెడ్ కోచ్, అలాగే బౌలింగ్ కోచ్ లేకుండా టీమిండియా.. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో తలపడింది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు.. రెండో టీ20లో మ్యాచ్ టై అయినా.. సూపర్ ఓవర్‌లో అద్భుత విజయం సాధించింది. కానీ.. మళ్లీ మూడో వన్డేలో ఓడిపోయింది. అయితే.. బౌలింగ్ కోచ్ లేకపోవడం తమపై ప్రభావం చూపుతోందని.. అయినా కూడా తమ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని, టీమ్ మీటింగ్స్‌లో ఎలాంటి ప్లాన్‌తో ముందుకెళ్లాలో వాళ్లే ప్లాన్ చేసుకుంటున్నారని, అదే బౌలింగ్ కోచ్ ఉండి ఉంటే.. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాస్తామని హర్మన్ ప్రీత్ కౌర్ వెల్లడించారు.
దీంతో.. భారత మహిళా జట్టుకు ఒక బౌలింగ్‌ను నియమించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులేదా? లేక మహిళా జట్టుపై చిన్నచూపా? అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇటివల కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరి రజత పతకం సాధించిన జట్టుకు కనీసం సౌకర్యాలు కల్పించరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నా.. సెంట్రల్ కాంట్రాక్ట్‌ల విషయంలో మాత్రం చాలా తేడా ఉంది. పురుష క్రికెటర్లకు ఏ ప్లస్ కేటగిరిలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తే.. రూ.7 కోట్లు చెల్లిస్తున్న బీసీసీఐ.. మహిళా క్రికెట్లరకు మాత్రం కేవలం రూ.1 కోటి మాత్రమే ఇస్తోంది. కాంట్రాక్ట్‌ల సంగతి ఎలా ఉన్నా.. ఒక జాతీయ జట్టుకు బౌలింగ్‌ను నియమించకపోవడంపై మాత్రం బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘We are definitely missing a bowling coach’: Harmanpreet Kaur after Indian bowlers concede big in T20I series#INDWvAUSW https://t.co/hpBYlzB334 pic.twitter.com/3JPUlkquVb
— Sports Tak (@sports_tak) December 15, 2022