ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపేలా కనిపిస్తున్నాయి. భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాక్ ఆడే మ్యాచ్ లను వేరే దేశాల్లో నిర్వహించాలని పాక్ కోరుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
గత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్లో అనిశ్చితమైన పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సంవత్సరాలు ఇండియా-పాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు. ఇక తాజాగా ఆసియా కప్ 2023 టోర్నీ లో భారత్ పాల్గొనబోదు అని బీసీసీఐ స్పష్టం చేసింది. అందుకు కారణం ఆసియా కప్ పాక్ లో నిర్వహించడమే. ఇక ఈ విషయంపై ఇప్పటికే ఆసియా కౌన్సిల్ పలు సమావేశాలు కూడా నిర్వహించింది. దాంతో టీమిండియా ఆడే మ్యాచ్ లను పాక్ నుంచి తటస్థ వేదికలకు మార్చాలని బీసీసీఐ సూచిందింది. ఈ నిర్ణయంపై పాక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపేలా కనిపిస్తున్నాయి. భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాక్ ఆడే మ్యాచ్ లను తటస్థ అంటే వేరే దేశాల్లో నిర్వహించాలని పాక్ కోరుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇందుకు సంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆసియా కప్ 2023.. పాకిస్థాన్ లో జరిగితే.. టీమిండియా ఈ టోర్నీలో పాల్గొనదు అని బీసీసీఐ తెలిపింది. దీనికి బదులుగా పాక్ అయితే మేం భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడబోం.. అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికీ ఈ పరిస్థితిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఈ క్రమంలోనే మరో ఆసక్తికరమైన వార్త క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే? భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్ లు అన్ని వేరే దేశాల్లో నిర్వహిస్తేనే పాక్ వరల్డ్ కప్ లో పాల్గొంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెప్పుకొచ్చినట్లు ఐసీసీ జనరల్ మేనేజర్ వసీమ్ ఖాన్ పేర్కొన్నాడు. దాంతో పాక్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే భారత్ ఆసియా కప్ ఆడటానికి రాదు అనడంలో భద్రతా కారణాలు ఉన్నాయి.. మరి పాక్ ఇండియాకు రాకపోవడానికి ఏ కారణాలు ఉన్నాయో చెప్పాలని వారు క్రీడా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. భారత్ పై పాక్ అలిగి పిచ్చి పని చేస్తోందని వారు అంటున్నారు. ఇక ఇండియా ఫ్యాన్స్ అయితే అచ్చతెలుగు సామెతలతో పాక్ పరువు తీస్తున్నారు. చెరువు పై అలిగి అదేదో కడుక్కోలేదట ఒకడు అంటూ.. పాకిస్థాన్ ను ఏకి పారేస్తున్నారు. ఇక క్రీడా ప్రపంచంలో అత్యంత ధనవంతమైన బోర్డుగా బీసీసీఐ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి బోర్డుతో పెట్టుకోవడానికి దాదాపుగా ఏ బోర్డులు కూడా సాహసించవు. మరి వరల్డ్ కప్ లో పాక్ ఆడే మ్యాచ్ లను భారత్ లో కాకుండా ఇతర దేశాల్లో నిర్వహించలన్న పాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ICC GM Wasim Khan said, “Pakistan likely to play their world cup matches at a neutral venue outside India”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2023