ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌ను ఇండియా, రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపొందాయి. దీంతో ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో సిరీస్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. కీలక పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడా విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రిషభ్ పంత్, హార్థిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుతంగా ఆడి విజయాన్ని అందించాడు. దీంతో పంత్, పాండ్యాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సైతం తనదైన శైలిలో స్పందించాడు.
సాధారణంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటే వసీం జాఫర్.. తన అభిప్రాయాలను సెటైరికల్‌గా చెప్పడంలో దిట్ట. కాగా.. ఇంగ్లండ్‌పై మూడో వన్డేలో భారత్ విజయం సాధించిన తీరును కూడా జాఫర్ తనదైన స్టైల్లోనే వివరించాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను పంత్, పాండ్యా ఇలా అదుకున్నారు, ఇంగ్లండ్ బౌలర్లను ఇలా చెడుగుడు ఆడుకున్నారు అనే అర్థం వచ్చేలా.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్-రామ్‌చరణ్ కలిసి నాటునాటు పాటకు స్టెప్పులు వేసే వీడియో షేర్ చేశాడు.
72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఒత్తిడిలో ఉంటే.. పంత్, పాండ్యా మాత్రం ఇలా ఉన్నారంటూ జాఫర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి వసీం జాఫర్ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“72/4, pressure on Hardik and Pant.”
Meanwhile @hardikpandya7 and @RishabhPant17: #ENGvIND pic.twitter.com/LkDs5ZDNqG— Wasim Jaffer (@WasimJaffer14) July 17, 2022