సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ హైదరాబాదీ బకరా అవ్వనున్నాడంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ షాకింగ్ కామెంట్ చేశాడు. ఇటివల ముగిసిన వేలంలో SRH ఫ్రాంచైజ్ తీసుకున్న ఆటగాళ్లపై సోషల్ మీడియాలో అసంతృత్తి వ్యక్తం అయింది. మంచి మంచి ఆటగాళ్లను వదిలేసి.. ఫామ్‌లో లేని ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించారని, జట్టు కూర్పుపై దృష్టి పెట్టలేదని SRH ఫ్యాన్స్ ఆరోపించారు.
ఫామ్‌లో లేని పూరన్ కోసం రూ. 10 కోట్లు పెట్టడం, మరో విండీస్ క్రికెటర్ రొమారియో షెఫర్డ్ కోసం రూ. 7.75 కోట్లు ఖర్చు పెట్టడంపై SRH అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాహుల్ త్రిపాటి, ఎయిడెన్ మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్ కొనుగోలు పర్వాలేకున్నా.. జట్టు పరంగా చూస్తే అంత బలంగా లేదన్నది ఎక్కువగా వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ కేన్ విలియమ్సన్ గురించి స్పందించాడు. ”SRH బ్యాటింగ్ ఆర్డర్‌లో విలియమ్సన్ వన్‌డౌన్‌లో ఎక్కువగా వస్తుంటాడు. తాజాగా ఐపీఎల్ మెగావేలంలో పూరన్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లను తీసుకోవడం ద్వారా విలియమ్సన్ తన స్థానాన్ని వేరొకరికి ఇచ్చే అవకాశం ఉంది. తనకు అచ్చొచ్చిన మూడో స్థానాన్ని వేరొకరికి త్యాగం చేస్తే అది బకరా కిందే లెక్క.
అయితే పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు రావాలంటే హిట్టర్లకు చాన్స్ ఇవ్వడం మినహాయించి విలియమ్సన్‌కు మరో అవకాశం లేదు. ఇక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ వస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. అభిషేక్ ఓపెనర్‌గా వస్తే మంచి స్ట్రైకర్‌గా వ్యవహరిస్తాడు. ఇది ఒక మంచి చాయిస్ అనే చెప్పొచ్చు” అని పేర్కొన్నాడు. వసీం అభిప్రాయంపై సోషల్ మీడియాలో SRH ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరి వసీం వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.