పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌ను పాకిస్థాన్ గెలుస్తుందని, పాక్ వద్ద ఉన్న బలమైన ఆయుధంతో ఇది సాధ్యం అవుతుందని అన్నాడు.
వన్డే వరల్డ్ కప్ 2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అన్ని జట్లు.. వన్డే ఫార్మాట్‌లో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడుతున్నాయి. టీమిండియా సైతం కొంతమంది ప్లేయర్లను ఎక్కువగా ఆడిస్తూ.. వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా ఆరు నెలల సమయం ఉన్నా.. ఎవరికి వారు వరల్డ్ కప్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ, పాకిస్థాన్ మాత్రం ప్రణాళికలు అటుంచి.. ప్రగల్భాలు పలుకుతోంది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023ను కచ్చితంగా పాకిస్థాన్ గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఈ సారి వరల్డ్ కప్‌ను గెలవకుండా పాకిస్థాన్‌ను ఎవరూ అడ్డుకోలేరని, వరల్డ్ కప్ గెలిచేందుకు తమ వద్ద ఒక బలమైన అస్త్రం ఉందని అక్రమ్ వెల్లడించారు. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టు లేని అడ్వాంటేజ్, బలం పాకిస్థాన్ జట్టుకు ఉందని, దాన్ని కొన్ని ఏళ్లనుంచి తాము నిర్మించుకుంటూ వచ్చామని అన్నాడు. పాకిష్థాన్ బౌలింగ్ ఎటాక్ దుర్బేధ్యంగా ఉందని, ఈ బౌలింగ్ ఎటాక్‌తో తాము భారత గడ్డపై వరల్డ్ కప్ గెలుస్తామని అక్రమ్ తెలిపాడు. షాహీన్ షా అఫ్రిదీ, హరీస్ రౌఫ్, నసీమ్ షాను పరోక్షంగా ఉదహరిస్తూ.. వసీం అక్రమ్ ఈ విధంగా పేర్కొన్నాడు.
టోర్నీ ఆరంభానికి ముందే ఆరు నెలల ముందే వసీం అక్రమ్ నుంచి స్టేట్‌మెంట్ రావడంతో భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లీ ఆడని ఇన్నింగ్స్‌ను అప్పుడే మర్చిపోయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా ఇండియాలో మ్యాచ్ పెట్టుకుని, టీమిండియాను దాటి పాకిస్థాన్ కప్పు కొట్టాలనే పగటి కలలు కంటుందంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ.. 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో హరీస్ రౌఫ్ బౌలింగ్ రెండు భారీ సిక్స్‌లు బాది మ్యాచ్‌ను టర్న్ చేసిన విషయం తెలిసిందే. మరీ వన్డే వరల్డ్ కప్ గురించి వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wasim Akram picks Pakistan as hot favourite pic.twitter.com/wVZP2Y6iDe
— RVCJ Media (@RVCJ_FB) March 22, 2023