ఆసియా కప్ 2022 సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆగస్టు 27నే టోర్నీ మొదలు కానుండగా, ఆ మరుసటి రోజే దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ తలపడున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 ప్రపంచకప్ 2021లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. అదే సీన్ ను మరోసారి రిపీట్ చేయాలని పాకిస్తాన్ ఉవ్విళ్ళూరుతోంది. ఈ క్రమంలో పాక్ మాజీ సారధి వసీం అక్రమ్.. ఆ జట్టుకు హెచ్చరికలు పంపాడు.
భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరన్న విషయంపై స్పంచిందిన అక్రమ్.. కోహ్లీ, రోహిత్, రాహుల్.. వంటి దిగ్గజాలను కాదని సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపాడు. ఆసియాకప్ టోర్నీలో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించే సత్తా సూర్యకుమార్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. “భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. అయితే.. వీరందరికన్నా సూర్యకుమార్ యాదవ్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు”.
Wasim akram feels..#wasimakram | #suryakumaryadav pic.twitter.com/VuYuC9Qjp5
— RVCJ Sports (@RVCJ_Sports) August 24, 2022
“సూర్యని తొలిసారిగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడినప్పుడు చూశాను. అప్పటికీ ,ఇప్పటికీ అతనిలో చాలా పరిణితి కనిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్ వచ్చాడు. ఆ మ్యాచ్‌ల్లో అంతగా రాణించికపోయినప్పటికీ.. అతడు ఆడిన షాట్లు మాత్రం అసాధారణమైనవి. ప్రస్తుతం సూర్య అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ అందుకు ఉదాహరణ. ఫైన్ లెగ్ దిశగా సూర్యలా షాట్‌లు ఆడడం చాలా కష్టం. ఒకే ఓవర్ లో మ్యాచ్ ను మలుపు తిప్పగలడు.. జాగ్రత్త” అని అక్రమ్ పేర్కొన్నాడు.
Wasim Akram on Suryakumar Yadav 🗣️#AsiaCup2022 #WasimAkram #SuryakumarYadav pic.twitter.com/EUSmcrS50e
— InsideSport (@InsideSportIND) August 24, 2022
సినిమాలో యాక్షన్, డ్రామా, సస్పెన్స్ ఉంటే ఎంత ఎగ్జైటింగ్‌గా ఉంటుందో.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అంతే ఆసక్తి ఉటుంది. ఇరుదేశాల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రాజకీయ కారణాలు, సరిహద్దు వివాదాలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు లేకపోవడంతో.. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఈ తరుణంలో ఈ మ్యాచ్ హైవోల్టేజ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. టిక్కెట్లు సైతం హాట్ కేకుల్లో నిమిషాల్లోనే అయిపోయాయి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దినేష్ కార్తీక్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.
స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.