క్రికెటర్లు, ఫిక్సింగ్ అనేది విడదీయలేని బంధం. ఎందుకంటే ప్రస్తుతం ఆడుతున్నవారు కావొచ్చు.. మాజీలు కావొచ్చు కొన్ని షాకింగ్ విషయాల్ని అప్పుడప్పుడు బయటపెడుతుంటారు. బయటవాళ్లపై కాదు గానీ తమతో పాటు ఆడిన ఆటగాళ్ల గురించి అసలు నిజాలు రివీల్ చేస్తుంటారు. అవి క్రికెట్ వర్గాల్లో ఆటం బాంబుల్లా పేలుతాయి. ఇప్పుడు కూడా ఓ దిగ్గజ క్రికెటర్.. తన ప్లేయర్ గా ఉన్నప్పుడు ఫేస్ చేసిన అనుభవాల్ని తను రాసిన బుక్ లో ప్రస్తావించాడు. మాజీ కెప్టెన్ పైనా ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇవి చర్చనీయాంశంగా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇప్పుడు క్రికెట్ లో ఫిక్సింగ్ జరగట్లేదని కాదు గానీ టెక్నాలజీతోపాటు సిస్టం మొత్తం స్ట్రాంగ్ గా మారిపోవడం వల్ల అటగాళ్లు.. ఆ సాహసం చేయట్లేదు. కానీ ఓ ఇరవై, ముప్పై ఏళ్ల ముందు మాత్రం ఫిక్సింగ్ జరిగేది. పలువురు కెప్టెన్లు, జట్టులోని ఆటగాళ్లనే దీనికి పాల్పడేవారు. ఇప్పుడు ఇదే విషయాన్ని దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ బయటపెట్టాడు. తాజాగా రిలీజ్ చేసిన తన బయోగ్రఫీ ‘సుల్తాన్: ఏ మెమొర్’ లో రివీల్ చేశాడు. పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ని లాబీయిస్ట్, ఆమిర్ సొహైల్ ని జాంబీ అని విమర్శించాడు.
‘1996లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో కొందరు లాబీయిస్టులు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం సంప్రదించినట్లు రషీద్ లతీఫ్.. సండే టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అందుకోసం 15 వేల పౌండ్స్ డబ్బుని ఆశ చూపాలని చెప్పాడు. ఎవరికి తెలుసు అతడు నిజంగానే ఆ డబ్బు తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈ విషయాన్ని జట్టు కెప్టెన్, కోచ్, మేనేజర్లకు అతడు చెప్పాడా? లేదు కదా. అతడు అందరి అటెన్షన్ ఆకర్షించాలని అనుకున్నప్పుడే ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి.’ అని అక్రమ్ చెప్పాడు. తన సహచర ఆటగాడు ఆమిర్ సొహైల్ కూడా లాబీయింగ్ కు పాల్పడేవాడని.. అందుకే అతడిని ‘జాంబీ ఫిగర్’ అని వసీం అక్రమ్ విమర్శించాడు. మరి వసీమ్ అక్రమ్ ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.