ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత దుమ్ములేపుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 300 మార్క్‌ను దాటింది. వీరికి తోడు సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో వాషింగ్టన్ శివాలెత్తి ఆడాడు. వన్డేలో టీ20 స్టైల్‌కు మించిపోయే బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు. కేవలం 16 బంతులు ఎదుర్కొన్న 3 ఫోర్లు, 3 సిక్సులతో చెలరేగి.. 37 పరుగులతో న్యూజిలాండ్ బౌలర్లను వణికించాడు. సుందర్ ధాటికి 280 వరకు వెళ్తుందనుకున్న టీమిండియా స్కోర్ 306కు చేరుకుంది.
వాషింగ్టన్ సుందర్ ఆడిన ఒక షాట్ మాత్రం మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. మాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో సుందర్ విశ్వరూపం ప్రదర్శించాడు. 12 బంతుల్లో 18 పరుగులతో చెలరేగి ఆడుతున్న సుందర్.. హెన్నీ వేసిన ఓవర్‌లో చివరి మూడో బంతుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4, 4, 6తో పరుగుల వరద పారించాడు. ఇందులో ముఖ్యంగా ఐదో బంతికి కొట్టిన సిక్స్ మాత్రం సూపర్ షాట్‌గా నిలిచింది ఆఫ్ స్టంప్ ఆఫ్ సైడ్ వెళ్లున్న బంతిని ఫైన్‌లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడి అదరగొట్టాడు. సుందర్ ఆడిన ఈ షాట్ చూస్తుంటే.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ గుర్తుకు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 4 పరుగులతో సూర్యకుమార్ నిరాశపర్చినా.. సుందర్ ఆ ఒక్క షాట్‌తో సూర్యను గుర్తు చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లు తుది జట్టులో ఉండటంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజు 38 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియాకు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చినా.. వెంటవెంటనే 4 కీలక వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు సపోర్ట్‌గా సంజు యాంకర్ రోల్ పోషించాడు. అలాగే కొంతకాలంగా ఫామ్‌లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రిషభ్ పంత్.. ఈ మ్యాచ్‌లో సైతం మరోసారి విఫలం అయ్యాడు. 23 బంతులాడిన పంత్.. కేవలం 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Washington Sundar magic with bat. pic.twitter.com/NBlnO0iBvD
— Johns. (@CricCrazyJohns) November 25, 2022
Washington Sundar channelling his inner SKY today! 🤩🤩🤩#NZvIND #SaddaPunjab #PunjabKings pic.twitter.com/LS1VQ3BavJ
— Punjab Kings (@PunjabKingsIPL) November 25, 2022