“మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు” తయ్యారైంది ప్రస్తుతం టీమిండియా పరిస్థితి. ఇప్పటికే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టీ20 వరల్డ్ కప్ కు స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న మరో బౌలర్ దీపక్ చాహర్ కూడా గాయం కారణంగా ఇటు సౌత్రాఫ్రికా రెండు వన్డేలకు దూరం అయ్యాడు. అతడి గాయం పెద్దది అయితే వరల్డ్ కప్ కు కూడా దూరం అయ్యే ఛాన్స్ లు లేకపోలేదు. అయితే అతడి స్థానంలో తమిళనాడు కు చెందిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీమిండియా ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉంది. డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్న నేపథ్యంలో.. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో తెలిక భారత్ తల పట్టుకుంది. ఈ క్రమంలోనే మరో స్టార్ బౌలర్ జట్టుకు దూరం అయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 తర్వాత దీపక్ చాహర్ కు వెన్నులో, గజ్జల్లో గాయం అయ్యింది. దాంతో అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరినట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ క్రమంలోనే అతడి స్థానంలో జట్టులోకి తమిళనాడు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకుంది. సుందర్ ఆఫ్ స్పిన్ తో పాటు ధాటిగా బ్యాటింగ్ కూడా చేయగలడు అనే పేరుంది.
అయితే సుందర్ కు వన్డే అనుభవం మత్రం తక్కువనే చెప్పాలి. ఇప్పటి వరకు సుందర్ కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడి 5 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 31 మ్యాచ్ ల్లో 7.25 ఎకానమీ తో 25 వికెట్లు పడగొట్టాడు. ఇక 51 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 33 వికెట్ల తో పాటు 318 పరుగులు చేశాడు. మధ్య ఓవర్లో భారీ షాట్ లు కొట్టడంలో సుందర్ మంచి ఆటగాడనే చెప్పాలి. మరి సౌతాఫ్రికాతో జరిగే రెండు వన్డేల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే.. అతడిని టీ20 వరల్డ్ కప్ కు పంపించే అవకాశాలు లేకపోలేదని క్రీడానిపుణులు వాదన. మరి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సుందర్ ఏ మేరకు రాణిస్తాడో మరి కొన్ని గంటలు వేచిచూడక తప్పదు.
🚨 NEWS 🚨: Washington Sundar replaces Deepak Chahar in ODI squad. #TeamIndia | #INDvSA
More Details 🔽https://t.co/uBidugMgK4
— BCCI (@BCCI) October 8, 2022
Deepak Chahar has a stiff back, and not a twisted ankle, because of which he has been ruled out of the last two ODIs against SA. He has moved to NCA in Bangalore and is likely to fly to Australia with Mohd Shami on October 16.
— Rahul Rawat (@rawatrahul9) October 7, 2022