ఆసియా కప్‌కు ఇంకా కొన్ని రోజులే మిగిలుంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసియా కప్ కోసం ఎదురుచూస్తోంది. అయితే భారత అభిమానులు మాత్రం ఆగస్టు 28న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో దాయాది దేశానికి, అక్కడి క్రికెట్ మాజీలు చేసే ఓవరాక్షన్‌కు బుద్ధి చెప్పాలంటూ ఆకాంక్షిస్తున్నారు. సందర్భం ఉన్నా లేకున్నా టీమిండియాపై నోరు పారేసుకుంటూ ఉంటారు.
గాయం కారణంగా పాక్ బౌలర్ షాహీన్ అఫ్రీది ఆసియా కప్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ పాక్ మాజీ ప్లేయర్ వకార్ యూనిస్ ఓవరాక్షన్ చేశాడు. షాహీన్ అఫ్రీది తిరిగి కోలుకోవాలంటూ కోరుకుంటూనే మరోవైపు భారత్ బతికిపోయిందంటూ చెప్పుకొచ్చాడు.
Every player of our playing 11 is a match winner. Wishing my team the best of luck for upcoming Asia Cup.
To the fans, keep me in your prayers for my quick recovery. I’ll be back soon Inshallah pic.twitter.com/jW9gGpWWQX
— Shaheen Shah Afridi (@iShaheenAfridi) August 20, 2022
“షాహీన్ అఫ్రీదికి గాయం కావడం టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్‌కు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. అతడిని మనం ఆసియా కప్‌లో చూడలేకపోవడం బాధ కలిగించే విషమే. త్వరగా కోలుకుని తిరిగిరా ఛాంప్” అంటూ వకార్ యూనిస్ ట్వీట్ చేశాడు. వకార్ యూనిస్ చేసిన ట్వీట్ వైరల్ కావడమే కాకుండా.. టీమిండియా ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
Shaheen’s injury Big relief for the Indian top order batsmen. Sad we won’t be seeing him in #AsiaCup2022 Get fit soon Champ @iShaheenAfridi pic.twitter.com/Fosph7yVHs
— Waqar Younis (@waqyounis99) August 20, 2022
వకార్ యూనిస్ ట్వీట్ పై క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. బుమ్రా గాయంతో తప్పుకోవడం కూడా పాక్ జట్టుకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలంటున్నారు. ఇంకొందరు గాయంతో బతికిపోయాడు. లేదంటే గ్రౌండ్‌లో బౌండిరీల రూపంలో టీమిండియా చుక్కలు చూపించేదంటున్నారు. పాక్ ఓడిపోయినా చెప్పుకోవడానికి ఓ సాకు దొరికిందిలే అంటూ కామెంట్ చేస్తున్నారు. వకార్ యూనిస్ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోతెలియజేయండి.
Hume to dukh ho rha h. Bach gya saala pitne se.
— Krishnappa GOATham (@KrishnappaGOAT) August 20, 2022
Same situation was of @TheRealPCB when Bumrah was ruled out from Asia Cup
— Mohammad Waris (@Waris_Haider86) August 20, 2022
Kuch din ke liye piche krade Asia cup fit ho jaye toh khel lena
— Rakku Maurya1718 (@MauryaRakku) August 20, 2022