క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. ఈ లక్షణం ఉంటేనే ఆటగాడు పరిణితి చెందినట్లు. ఎంత మేటి ఆటగాడు అయినప్పటికీ ఇతర జట్ల పట్ల, ఆటగాళ్ల పట్ల గౌరవం ఉండాలి. ఈ క్రమంలోనే క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు ICC వార్నింగ్ లు ఇస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ ఆల్ రౌండర్ కు ఇలాంటి వార్నింగే ఇచ్చింది. పైగా ఓ పాయింట్ ను సైతం కోతవిధించింది. ఐసీసీ ప్రవర్తనా నియామావళి లెవల్ 1 ను ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వరల్డ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
2023లో భారత్ వేదికగా ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ సూపర్ లీగ్ సిరీస్ లో భాగంగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. తాజాగ మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసే క్రమంలో ఇన్నింగ్స్ 26వ ఓవర్ వేయడానికి వచ్చాడు హసరంగా. ఈ ఓవర్లో ఆఫ్ఘన్ బ్యాటర్ నజీబుల్ల ని ఫీల్డ్ అంపైర్ అవుట్ అని నిర్ణయం తీసుకున్నాడు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం రిప్లే చూసి దాన్ని నాటౌట్ గా ప్రకటించాడు.
ఈ క్రమలోనే అంపైర్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు హసరంగా. ఇది ఐసీసీ నిబంధనలు ఆర్టికల్ 2.8 సెక్షన్ కింద నిబంధనలు ఉల్లంఘించినట్లు అని కమిటీ సభ్యుడు రంజన మాడుగల్లే తెలిపాడు. ఈ విషయంపై హసరంగా కూడా తప్పు ఒప్పుకోవడంతో అతడిని మందలించి వదిలేసింది. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అంపైర్ల నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం క్రమశిక్షణారహితం. ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 313 స్కోరును సాధించింది. అనంతరం శ్రీలంక 49.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Sri Lanka player #WaninduHasaranga has been handed an official reprimand for breaching Level 1 of the ICC Code of Conduct.
Full details 👇https://t.co/0mQYLKJnsx
— CricTracker (@Cricketracker) December 1, 2022