ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను బౌన్సర్లతో బెంబేలెత్తించాడో బౌలర్.. అతని బంతులు ఎదుర్కొలేక వణికిపోయాడు వాట్సన్. బౌలర్ వేస్తున్న బంతులకు తన దగ్గర సమాధానమే లేదన్నట్లు చూస్తూ ఉండిపోయాడు. కానీ అద్భుత బౌలింగ్ చేసిన ఆ బౌలర్ మాత్రం తన బౌలింగ్‌పై అంత సంతృప్తిగా లేడు. కారణం.. తన ప్రదర్శన తన జట్టును గెలిపించలేకపోయింది. ఈ సంఘటన 2015 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పాక్ బౌలర్ వాహబ్ రియాజ్ తన విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవరల్‌లో వరుస బౌన్సర్లు విసిరి వాట్సన్‌ను భయపెట్టినంత పని చేశాడు. బౌన్సర్లు వేయడంతో పాటు.. వాట్సన్ దగ్గరికెళ్లి చప్పట్లు కొడుతూ.. పుండుపై కారం చల్లాడు వాహబ్. దాదాపు ఏడేళ్ల క్రితం వాహబ్ వేసిన ఈ సూపర్ బౌలింగ్ వీడియోను ఒక స్పోర్ట్స్ ఛానల్ ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. స్పందించిన వాహబ్.. తన బౌలింగ్‌పై చూపిస్తున్న ప్రేమకు బాధతో కూడిన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. అందుకు కారణం.. తన ప్రదర్శన తన జట్టును వరల్డ్ ఫైనల్ చేర్చలేకపోవడమే.
ఆ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. పాక్ ఓడినా వాహబ్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిసింది. కానీ మ్యాచ్‌లో వాహబ్.. వాట్సన్‌ను టార్గెట్ చేయడం వెనక ఆసీస్‌కు అలవాటైన స్లెడ్జింగ్ కారణం. ఆ మ్యాచ్‌లో పాక్ ముందుగా బ్యాటింగ్ చేసింది. వాహబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మిచ్చెల్ స్టార్క్ బౌలింగ్‌ను వాహబ్ ధీటుగా ఎదుర్కొలేకపోయాడు. అతని బంతులను వదిలేస్తూ వికెట్ కాపాడుకున్నాడు. అదే సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న వాట్సన్.. వాహబ్ రియాజ్ వద్దకు వెళ్లి.. ‘నీ బ్యాట్‌కు రంధ్రం ఉందా.. అన్ని బంతులూ మిస్ అవుతున్నాయి’ అంటూ వాహబ్‌ను రెచ్చగొట్టాడు వాట్సన్. అది మనసులో పెట్టుకున్న వాహబ్.. వాట్సన్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో బౌన్సర్లతో తన విశ్వరూపం చూపించాడు. కానీ.. మ్యాచ్‌లో ఆసీస్ గెలిచింది. వాట్సన్ 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ లో అవమానం.. కానీ అక్కడ మాత్రం రైనాకు ప్రతిష్టాత్మక అవార్డు
ఇదే విషయంపై వాట్సన్ కూడా స్పందించాడు. నిజానికి వాహబ్ అంత వేగంతో, కచ్చితమైన బౌలింగ్ చేస్తాడని తాను ఊహించలేదని అన్నాడు. ఆ సమయంలో వాహబ్ తనపై పైచేయి సాధించినట్లు ఒప్పుకున్నాడు. ఆ సంఘటన తన కెరీర్‌లో మరుపురాని అనుభవంగా ఉంటుందని చెప్పాడు. చివరికి తాము మ్యాచ్ గెలవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. కాగా.. మ్యాచ్ అనంతరం వాట్సన్‌కు 20 శాతం, వాహబ్‌కు 50 శాతం మ్యాచ్ ఫీజ్‌లో రిఫరీ కోత విధించడం విశేషం. ఒక జట్టు ఆటగాడు మరో జట్టు ఆటగాడిని స్టెడ్జింగ్‌తో రెచ్చగొడితే.. అతను ఆవేశానికి పోయి అవుట్ అవ్వచ్చు.. లేదా తనలోని అద్భుత ఆటను బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది. వాట్సన్ స్లెడ్జింగ్ వల్ల వాహబ్‌లోని సూపర్ బౌలర్ బయటికి వచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కటిక నేలపై పడుకున్న విరాట్ కోహ్లీ! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
While I appreciate all the love I get for this spell against Australlia, it’s mixed with pain that my spell did not result in Pakistan winning the match. Sigh https://t.co/1UpbVR4zZD
— Wahab Riaz (@WahabViki) March 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.