2022, టీమిండియాకు చాలా భారంగా గడిచింది. కెప్టెన్ల మార్పుతో పాటు చాలా పొరపాట్లు జరిగాయి. ఇప్పుడు వాటిని గానీ సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ఛాన్సుంది. అందులో భాగంగానే ఇప్పటికే కెప్టెన్సీ విషయంలో పలు మార్పులు జరుగుతున్నాయి. నేటి(జనవరి 3) నుంచి శ్రీలంకతో జరగబోయే టీ20లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు రోహిత్ కెప్టెన్సీ వహిస్తారు. ఇక త్వరలో కెప్టెన్సీ బాధ్యతలు పూర్తిగా హార్దిక్ కే అప్పగించనున్నారని తెలుస్తోంది. ఈ విషయం ఇంకా తేలకముందు కోచ్ కూడా మారే ఛాన్సుందని అంటున్నారు.
ఇక విషయానికొస్తే.. టీమిండియా హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై వేటు పడనుందా అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తుంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్.. భారత జట్టు తదుపరి కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది నవంబరులో జరిగే వన్డే ప్రపంచకప్ రిజల్ట్ పై ఈ నిర్ణయం ఆధారపడినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్ లో ఆశించిన ఫలితం సాధిస్తేనే ద్రవిడ్ కాంట్రాక్ట్ కొనసాగిస్తారు. లేదంటే మాత్రం అతడికి టాటా చెప్పడం పక్కా అని వినిపిస్తుంది. బీసీసీఐ సమీక్ష సమావేశం సోమవారం జరగ్గా.. అందులో ఈ విషయమే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ద్రవిడ్ కు బదులు టీమిండియా-ఏ జట్టుకు లక్ష్మణ్ కోచ్ గా చేస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో వీవీఎస్ కీలకపాత్ర పోషించాడు. అందుకే లక్ష్మణ్ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. దానికోసం ఇప్పటినుంచే బీసీసీఐ ప్లాన్ రెడీ చేస్తోంది. అలానే ఈ ఏడాదే ఆసియాకప్, టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్ కూడా జరగనున్నాయి. ఈ క్రమంలోనే ద్రవిడ్ ని.. టెస్టులు, వన్డేలకు కొనసాగించాలని, టీ20లకు మాత్రం లక్ష్మణ్ ని కోచ్ గా పెట్టాలని మేనేజ్ మెంట్ భావిస్తుంది. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏదేమైనా సరే ఈ నిర్ణయాన్ని మాత్రం అమలు చేసి తీరాలని బీసీసీఐ భావిస్తుంది. ఇంగ్లాండ్ జట్టు ఇలానే విజయాలు సాధిస్తుందని మెజారిటీ సభ్యులు ఉదాహరణగా చూపిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.. మరి ద్రవిడ్ బదులు లక్ష్మణ్ కోచ్ అయితే ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
VVS Laxman might replace Rahul Dravid as India’s Head Coach after the 2023 World Cup.🏏🇮🇳 pic.twitter.com/CsoVdk6UC0
— CricketGully (@thecricketgully) January 2, 2023