భారత్‌లో విస్తృత వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీ వివోపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముప్పేట దాడులు చేసింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో.. ఆ సంస్థకు చెందిన 44 కార్యాలయాల్లో సోదాలు జరిపింది. ఈ దాడుల్లో వివో పన్ను ఎగవేతకు పాల్పడినట్లుగా గుర్తించింది. ఏకంగా 62,476 కోట్ల రూపాయల మేర పన్నును చెల్లించకుండా, ఆ మొత్తాన్ని చైనాకు తరలించిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ధృవీకరించారు. ఈ క్రమంలో వివో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విరాట్ కోహ్లీ నటించిన వాణిజ్య ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈడీ దాడుల నేపథ్యంలో.. కోహ్లీ నటించిన అడ్వర్టయిజ్‌మెంట్లను వివో నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టెలివిజన్ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్న వాణిజ్య ప్రకటనలు అవి. వాటికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం ఇదవరకే పూర్తయింది. ఈ మేరకు వివో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది తాత్కాలికమేనని, ఇప్పుడున్న సమస్యలు పరిష్కరించుకున్న తరువాత వాటిని ప్రసారం చేస్తామని పేర్కొంది. తాము తీసుకున్న ఈ నిర్ణయం విరాట్ కోహ్లీకి కూడా మేలు కలిగిస్తుందని వ్యాఖ్యానించింది.
Chinese Smartphone Company Vivo Stopped Brand Ambassador Virat Kohli https://t.co/uGmSebyKHG
— ARFIUS.com (@Arfius_Official) July 9, 2022
ఇది కూడా చదవండి: Sara Tendulkar: ‘మీ నాన్న డబ్బు వేస్ట్ చేస్తున్నావ్’ నెటిజన్ కామెంట్.. కౌంటరిచ్చిన సచిన్ కూతురు!
గతేడాది ఏప్రిల్‌లో విరాట్ కోహ్లీ.. వివోతో అసోసియేట్ అయ్యారు. బ్రాండ్ అంబాసిడర్‌గా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. కోహ్లీ వివోతో మాత్రమే కాకుండా.. ఆడి లగ్జరీ కార్లు, అమెరికన్ టూరిస్టర్ లగేజీ, ప్యూమా స్పోర్ట్స్‌వేర్, టిస్సాట్ వాచీలు, మింత్రా ఫ్యాషన్, గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్, హైపరైస్ వెల్‌నెస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
వివోకు చెందిన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై డ్రాగన్ దేశం స్పందించింది. చైనాకు చెందిన కంపెనీలనే లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులు నిర్వహించడం వల్ల భారత్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతింటుందని పేర్కొంది. చైనా, విదేశాలకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి వాంగ్ జియాజియాన్ దీనిపై స్పందించారు.
Raids on Vivo: ED seizes funds of Rs 465 crore, Rs 73 lakh in cash and 2 kg gold under anti-money laundering law
— Press Trust of India (@PTI_News) July 7, 2022
ఇది కూడా చదవండి: Rohit Sharma, Virat Kohli: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ, కోహ్లీ! ఎవరు ముందు సాధిస్తారో?