వాళ్లందరూ క్రికెటర్లు. గ్రౌండ్ లో మ్యాచ్ పూర్తి చేసుకుని.. ఎయిర్ పోర్ట్ కి తిరుగు పయనమయ్యారు. అప్పటివరకు జరిగిన మ్యాచ్ గురించి తోటీ క్రికెటర్లతో బస్సులో గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సడన్ గా యాక్సిడెంట్ జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బస్సు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 11 నుంచి విశాఖపట్నంలో మహిళల సీనియర్ టీ20 మ్యాచులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం బరోడా జట్టు మ్యాచ్ ఆడింది. పూర్తి చేసుకున్న తర్వాత ఎయిర్ పోర్ట్ కి ప్రయాణమైంది.
ఈ క్రమంలోనే తాటిచెట్ల పాలెం జాతీయ రహదారి జంక్షన వద్ద యాక్సిడెంట్ జరిగింది. బస్సు ముందు వెళ్తున్న.. లారీ సడనడ్ గా బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ లో భాగంగా బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఇకపోతే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కంచరపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఉన్న నలుగురు క్రికెటర్లకు గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం.. సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి మెరుగైందని వైద్యులు వెల్లడించారు. మిగిలిన వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారని తెలిసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.