టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కానీలో వేలాడదీసాడని తెలిపాడు. ఏ మాత్రం పొరపాటు జరిగినా.. తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఆ ప్లేయర్ పేరు మాత్రం వెల్లడించలేదు. ఇక చాహల్ వెల్లడించిన షాకింగ్ ఘటనపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్ స్పందించాడు.
15 వ ప్లోర్ లో వేళాడదీయడమంటే.. అది సరదాగా చేసిన పని కాదు, అతని పేరు చెప్పు.. సదరు ఆటగాడిపై ఏ చర్యలు తీసుకున్నారో అందరకి తెలియాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘తాగిన మైకంలో చాహల్‌ను బాల్కనీలో వేలాడదీసిన ఆటగాడి పేరు వెల్లడించాలి. చాహల్ చెప్పింది నిజమైతే అది ఏ మాత్రం సరదాగా చేసిన పని కాదు. అసలేం జరిగిందనే విషయం అందరకి తెలియాలి. అంతేకాకుండా సదరు ఆటగాడిపై ఏ చర్యలు తీసుకున్నారో అనే విషయం కూడా తెలియాలి’ అని సెహ్వాగ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నించాడు.
Terrible terrible tweet this from sehwag on so many levels.
u (and some other ex cricketers) also wanted the name of journalist in Saha case… what did u do after Boria exposed himself?@virendersehwag#Chahal pic.twitter.com/ZAo4n46fqU— 🅰️ (@DrCricket__) April 8, 2022
ఇది కూడా చదవండి: ఇప్పటికీ, ఎప్పటికీ అతనే నా హీరో: రోహిత్ శర్మ
అసలు విషయం ఏంటంటే..
“ఆర్‌సీబీ ప్లేయర్ కారణంగా 2013లో ఒకసారి తన వెన్నులో వణుకు పుట్టిందని చాహల్ చెప్పుకొచ్చాడు. ‘ఈ స్టోరీని ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. ఎక్కడా షేర్ చేసుకోలేదు. 2013లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో నేను ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడేవాడ్ని. ఆ ఏడాది బెంగళూరుతో మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్లకీ గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. అందులో ఆర్‌సీబీ ప్లేయర్ ఒకరు అతిగా మద్యం సేవించాడు. నేను అతని పేరు చెప్పను. కానీ.. ఆ రోజు అతను మితిమీరి మద్యం తాగాడు.
Yuzvendra Chahal Shocking Revelation…
Drunk Mumbai Indians Player Tried To Throw Him From Balcony Of 15Th Player.@yuzi_chahal Please Name That Player, So That Others This Kind Of Action Is Not Repeated.#YuzvendraChahal #IPL2022 #MumbaiIndians pic.twitter.com/eSE5lei7JP
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) April 8, 2022
ఇది కూడా చదవండి: హెలికాప్టర్ షాట్‌ను కొత్త స్టైల్లో ఆడిన పంత్! గురువు తగ్గ శిష్యుడే
పార్టీ అయ్యాక.. అతను నా వైపు చాలాసేపు చూసి.. దగ్గరికి రమ్మని పిలిచాడు. నేను వెళ్లగానే అతను నన్ను అమాంతం పైకి ఎత్తుకుని.. బాల్కానీ వద్దకి తీసుకెళ్లి వేలాడదీశాడు. దాంతో.. బిత్తరపోయిన నేను నా చేతుల్ని అతని మెడ చుట్టూ వేసి పట్టుకున్నాను. అప్పుడు మేము 15వ ప్లోర్‌లో ఉన్నాం. ఈ ఊహించని ఘటనతో నేను దాదాపు మూర్చపోయాను. అక్కడ ఉన్న వాళ్లు నాకు మంచినీళ్లు ఇచ్చారు. కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న, ఏ చిన్న తప్పిదం జరిగి ఉన్నా? నేను 15వ అంతస్థు నుంచి కింద పడిపోయేవాడ్ని’’ అని చాహల్ తనకు జరిగిన చేదు ఘటన గురించి వివరించాడు. చాహల్ కు జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
So sorry for what happened @yuzi_chahal ! You should have reported back then , stern action would have been taken. Now neither the franchise nor BCCI can do anything about it. And this is not about cricket, any work place bullying / harassment must be reported. #YuzvendraChahal https://t.co/lT3w1rYzFn
— ravitej sahu (@ravitejsahu) April 8, 2022
Surely #YuzvendraChahal had tell MIstaff of the whole scenario.But what i think is they didn’t make itopen just for sake of their image.Or the player could be key player of mi just to protect him they didn’t revealedAs this is a crime like attempt to murder as he maylost his live
— Dinojames (@Dinojam70821927) April 8, 2022
Prior to the 2013 balcony incident #IPL #Chahal @mipaltan #MumbaiIndians #CricketTwitter pic.twitter.com/JnenAxAWqG
— All About Cricket (@AllAboutCricke8) April 8, 2022