బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ స్వర్ణం గెలిచిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అందరూ సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పుడీ వార్త ఫేక్ అని తేలింది. దీంతో శుభాకాంక్షలు తెలిపిన వారు తమ పోస్టులను డిలీట్ చేసే పనిలో పడ్డారు. వీరిలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు. వెంటనే తాను పెట్టిన పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అయితే.. అప్పటికే జరగాల్సిన పని జరిగిపోయింది. ఆ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసిన కొందరు.. సెహ్వాగ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టటారు.
ఎవరు మొదలెట్టారో, ఎలా మొదలెట్టారో తెలీదు కానీ కామన్వెల్త్ గేమ్స్ 400 మీటర్ల ఈవెంట్‌లో హిమా దాస్ స్వర్ణం సాధించిందంటూ ఓ వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్ అయ్యింది. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన హిమా దాస్ వీడియోను బర్మింగ్‌హమ్‌లో జరిగినట్టుగా చెబుతూ ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఇది చూసిన వీరేంద్ర సెహ్వాగ్.. హిమా దాస్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
Congratulations …..
Hima Das wins 400m Gold in CWG at Birmingham
She creates a History !!
India wins first ever Gold in Track and Field at CWG.
👏👏👏#HimaDas #CWG2022#CommonwealthGamespic.twitter.com/VGfIq6j3Ix— M Rais Siddiqui محمد رئیس صدیقی (@MRaisSiddiqui3) July 30, 2022
“వాట్ ఏ విన్.. భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన హిమాదాస్‌కి కంగ్రాట్స్..” అంటూ ట్వీట్ చేసిన సెహ్వాగ్, ఆ తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని.. దాన్ని వెంటనే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే చాలామంది వీరూ ట్వీట్‌ని స్రీన్ షాట్ తీసి, దాన్ని పోస్టు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
First to gold tha na tau 🤣🤣🤣🤣 pic.twitter.com/Hi8tkpDfwS
— MSDIAN 🦁🏆 (@MSD_077) July 30, 2022
కాసేపటికి వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన సంకేత్ సగ్రార్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ బోణీ కొట్టింది. 55 కేజీల పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరిలో పోటిపడిన భారత వెయిట్‌లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సాగర్, కాంస్య పతకం సాధించాడు. 21 ఏళ్ల సంకేత్ మహదేవ్ తండ్రి ఓ పాన్ షాప్ యజమాని కావడం విశేషం. అలాగే.. 61కేజీలో విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించాడు.
First medal for India in #CWG22 🇮🇳🇮🇳
Sustained an injury, but didn’t give up!! Well done #SanketSargar, as you bag the first medal for India at CWG2022.
Your silver shines bright and makes us proud. 🥈🇮🇳#Cheer4India pic.twitter.com/Wk2U9LW6Ch
— Nisith Pramanik (@NisithPramanik) July 30, 2022
ఇదీ చదవండి: కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియాకు దక్కని శుభారంభం! ఆకట్టుకున్న రేణుక
ఇదీ చదవండి: Sachin: సచిన్ విషయంలో అమర్యాదగా ప్రవర్తించిన ఆసీస్ క్రికెటర్! మండిపడ్డ ఫ్యాన్స్