SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Virender Sehwag Says We And Pakistani Cricketers Are Friends And Brotherhood

IND vs PAK: భారత్‌-పాక్‌ ఆటగాళ్లు గొడవపడతారని అనుకుంటారు! కానీ అదంతా..: సెహ్వాగ్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 26 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs PAK: భారత్‌-పాక్‌ ఆటగాళ్లు గొడవపడతారని అనుకుంటారు! కానీ అదంతా..: సెహ్వాగ్‌

రేపటి నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. కానీ.. ఆదివారం జరిగే అసలు సిసలైన క్రికెట్‌ యుద్ధం కోసమే అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అదే ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా.. హైప్‌ ఒక రేంజ్‌లో ఉంటుంది. ఆటగాళ్లపై ఏదో తెలియని ఒత్తిడి, అభిమానుల్లో భారీ అంచనాలు, మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. పరుగు పరుగుకు మారిపోయే అభిమానుల భావోద్వేగాలు ఇలా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటేనే అదో రక్తం చిందని యుద్ధం. మ్యాచ్‌కు ముందు పరిస్థితి ఇలా ఉంటే మ్యాచ్‌ తర్వాత కూడా క్రికెట్‌ అభిమానుల్లో ఆ ఫీవర్‌ తగ్గదు.

గెలిస్తే సంతోషంతో చర్చలు, పొగడ్తలు. ఓడితే మాత్రం మ్యాచ్‌పై తారాస్థాయికి చేరే విశ్లేషణలు, సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం, కొన్ని సార్లు క్రికెటర్ల ఇళ్లపై దాడులు కూడా జరుగుతాయి. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ను ఆటలా కాకుండా పరువుగా భావించడమే దీనంతటికీ కారణం. భారత్‌, పాకిస్థాన్‌ ఇరుదేశాల అభిమానులు మిగతా మ్యాచ్‌లను చూసే విధానం వేరు.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను చూసే కోణం వేరు. ఈ దాయాదుల మధ్య ఉన్న వైరం ఈ పరిస్థితులకు మూలకారణం. ఇదే పరిస్థితి కొన్ని ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఆటగాళ్లు మారినా, కొత్త అభిమానులు పుట్టుకొస్తున్నా.. భావోద్వేగాల్లో ఎలాంటి మార్పు ఉండదు.

కొంతకాలం ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేని కారణంగా.. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్‌-పాక్‌ తలపడతున్నాయి. దీంతో ఏడాది కొకసారి వచ్చే పండుగలా తయారైంది పరిస్థితి. తాజాగా ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఎప్పటిలాగే క్రికెట్‌ అభిమానుల్లో మ్యాచ్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై టీమిండియా క్రికెటర్‌ మాజీ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందిస్తూ.. మేమంతా అన్నదమ్ముల్లా ఉంటామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్‌-పాకిస్థాన్‌ జట్లు ఒక్కసారి గ్రౌండ్‌లోకి దిగితే.. పోటీ తారస్థాయిలోనే ఉంటుంది. మేమైనా, వాళ్లు అయినా సరే మంచి ప్రదర్శన కనబర్చాలనే కసితోనే ఆడతాం. ఎవరికి వాళ్లం తమ జట్లను గెలిపించాలని ఆడతాం. మ్యాచ్‌ ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్లి మ్యాచ్‌ సంగతి మర్చిపోయి కలిసిపోతాం. మా మధ్య అమితమైన ప్రేమానుబంధాలు ఉంటాయి. కానీ.. కొందరు తెలియక భారత్‌-పాక్‌ ఆటగాళ్ల మధ్య గొడవలు జరుగుతాయి అంటూ ఏవేవో మాట్లాడుతుంటారు. నిజానికి అలాంటి గొడవలేమి ఉండవు. మా మధ్య పోటీ, వైరం కేవలం మ్యాచ్‌ వరకే.. గ్రౌండ్‌ బయటికొస్తే మేమంతా మంచి ఫ్రెండ్స్‌.. నిజానికి అన్నదమ్ముల్లా కలిసిపోతాం.’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

Join Our Whatsapp Channel

సెహ్వాగ్‌ మాటలను నిజం చేస్తూ.. తాజాగా యూఏఈలో ప్రాక్టీస్‌ సందర్భంగా ఎదురుపడ్డ భారత్‌-పాక్‌ ఆటగాళ్లు ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. కోహ్లీ పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, కోచ్‌ యూసుఫ్‌తో మాట్లాడిన వీడియోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అలాగే గాయం కారణంగా టోర్నీకి దూరమైన షాహీన్‌ అఫ్రిదీని దగ్గరికెళ్లి మరీ చాహల్‌, కోహ్లీ, పంత్‌ పరామర్శించడంతో వారి మధ్య మంచి స్నేహ వాతావరణం ఉన్న విషయం అర్థం అవుతుంది. కానీ.. అభిమానులు మాత్రం పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడితే మాత్రం అంత తేలిగ్గా జీర్ణించుకోలేరు. అలాగే భారత్‌ చేతిలో పాక్ ఓడినా ఆ దేశ అభిమానులు కూడా అంత తేలిగ్గా తీసుకోలేదు. ఇరు దేశ అభిమానుల్లో ఉన్న ఫీలింగ్‌ ఒకే విధమైంది.. మా దేశం గెలవాలి. కానీ.. ఆటలో గెలుపు కచ్చితంగా ఒక్కరికే దక్కుతుంది. రెండు జట్లు సమాన బలంతో ఉన్నా.. ఆ రోజు వారిచ్చే ది బెస్ట్‌ ప్రదర్శనపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మరి సెహ్వాగ్‌ చెప్పినట్లు ఆటను ఆటలా చూసి.. ఫ్యాన్స్‌ భావోద్వేగాలను నియంత్రించుకుంటారో.. లేక ఎప్పటి లాగే గెలిస్తే నెత్తిన పెట్టుకోవడం, ఓడితే దూషణలకు దిగడం చేస్తారో.. చూడాలి. మరి ఈ విషయంలో సెహ్వాగ్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఆసియా కప్‌‌ టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచుల లెక్కలు ఇవే!

Out of context IND vs Pak pic.twitter.com/sKHiSsRzlR

— Out Of Context Cricket (@GemsOfCricket) August 26, 2022

Pak vs ind friendship moments 😘😙😚 #INDvPAK #BabarAzam #ViratKohli #AsiaCup2022 #shanewarne #PakVsInd #Asif #amir pic.twitter.com/4CEIaTw2Us

— 🇵🇰🏏🇵🇰 (@follow100billin) August 24, 2022

Are you ready for the biggest battle PAK🇵🇰 vs IND🇮🇳 on #28august 😍?#PakVsInd pic.twitter.com/KIMPAPfKuv

— QirratSiddique|Imrankhan ❤️ (@Qirratsiddique) August 25, 2022

This is pak vs ind at its peak pic.twitter.com/OkEUjF7i7n

— Hadiya (@dekhainjee) August 26, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • pakistan
  • Team India
  • Virender Sehwag
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam