ఓపెనర్‌గా వచ్చి ఫస్ట్ బాల్ నుంచే బాదే క్రికెటర్ ఎవరని ఎవర్ని అడిగినా.. చెప్పే సమాధానం వీరేందర్ సెహ్వాగ్. వీరబాదుడికి మారుపేరులా నిలిచిన సెహ్వాగ్.. తనలా ఆడే బ్యాటర్ ప్రస్తుత భారత జట్టులో లేడని అంటున్నాడు..
సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా సచిన్, సెహ్వాగ్ ఓపెనర్లుగా మిడిల్డార్‌లో ద్రవిడ్, యువరాజ్ సింగ్.. బౌలర్లగా జహీర్ ఖాన్, కుంబ్లే, హర్భజన్ సింగ్, నెహ్రా వీరితో కూడిన టీమిండియాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. సీనియర్ క్రికెట్ అభిమానులకు ఈ టీమ్ ఒక ఛాంపియన్ టీమ్. వరల్డ్ కప్ నెగ్గకపోయినా.. ఈ టీమ్‌కు ఉండే క్రేజ్ వేరు. వీరిలో ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంది. ముఖ్యంగా వీరేందర్ సెహ్వాగ్ గురించి మాట్లాడుకుంటే.. ఓపెనింగ్ బ్యాటర్‌కు అప్పటి వరకు ఉన్న నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తూ.. ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించాడు. బంతి పాత బడేంత వరకు ఓపెనర్లు నిదానంగా ఆడాలనే నియమాన్ని.. బద్దలుకొట్టిన ఓపెనర్.
బాల్ పాత బడాలంటే నిదానంగా ఆడి టైమ్ గడపాల్సిన అవసరం లేదని, బాల్‌ను చితక్కొట్టి కూడా పాతగా చేయొచ్చని బాది చూపించిన విధ్వంసకర ఓపెనర్. టీ20 క్రికెట్ ఇంకా పురుడుపోసుకోని కాలంలోనే ఆ స్టైల్ బ్యాటింగ్ చేసి చూపించాడు. అందుకే సెహ్వాగ్‌ను వీరబాదుడు బాదే వీరూ అని కూడా పిలిస్తుంటారు. ఫస్ట్ బాల్ నుంచే అగ్రెసివ్ మైండ్‌సెట్‌తో ఆడే సెహ్వాగ్ బ్యాటింగ్‌ను అభిమానించే వాళ్లు కోట్లలో ఉంటారు. కేవలం సెహ్వాగ్ బ్యాటింగ్ మాత్రమే చేసి తర్వాత టీవీ కట్టేసే వీరాభిమానులు వీరేంద్రుడి సొంతం. అలాంటి ఫ్యాన్స్‌ను పొందేందుకు సెహ్వాగ్‌కు తెలిసిన ఒకే ఒక మంత్రం బాదుడే. అదే సెహ్వాగ్‌ను స్పెషల్ బ్యాటర్‌గా చేసింది.
సాంప్రదాయ టెస్టు క్రికెట్‌లోనూ సెహ్వాగ్ వేగంగానే బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలు, టీ20లు, టెస్టులు అనే తేడా అతనికి లేదు. టెస్టు క్రికెట్‌లో 299 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిక్స్ కొట్టే దమ్ము సెహ్వాగ్‌కు మాత్రమే ఉంది. అందుకే ఇండియన్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా సెహ్వాగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే.. సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత అలాంటి ఆటగాడి లోటు టీమిండియాలో అలాగే ఉండిపోయింది. ఈ విషయంపై సెహ్వాగ్ సైతం స్పందిస్తూ.. తనలా ఆడే ఆటగాడు ఇండియన్ టీమ్‌లో ఎవరూ కనిపించడం లేదని.. పృథ్వీ షా, రిషభ్ పంత్ నా శైలికి కాస్త దగ్గరగా ఉన్నా.. పంత్ 90, 100 తోనే సరిపెట్టుకుంటున్నాడని, నాలా 200, 250, 300ల వైపు చూడటం లేదని అన్నాడు. అయితే.. పంత్, పృథ్వీ షా ఇద్దరూ అగ్రెసివ్ ప్లేయర్లే. ముఖ్యంగా పంత్ టెస్టు క్రికెట్‌లో అగ్రెసివ్ గేమ్‌తో మంచి మార్కులు కొట్టేశాడు. అయితే అతను గత డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురై.. ప్రస్తుతం కోలుకుంటున్న విషయం తెలిసిందే. మరి సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
‘No one can bat like me…: Virender Sehwag shrugs off comparisons to current Team India players; names two who come closehttps://t.co/yV4W7u0ytT pic.twitter.com/5ilkdFp6gn
— Sports Tak (@sports_tak) March 20, 2023