తన ధనాధన్ బ్యాటింగ్ తో ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. ఒకరి విషయంలో పొరపడ్డారట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా..? ఏం లేదండీ.. ఓ భారత క్రికెటర్ జీవితం తొందరగా ముగుస్తుందని సెహ్వాగ్ అంచనా వేశాడట. కానీ అది జరగగా పోగా.. అతడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాడట. సెహ్వాగ్ చెప్పిన ఆ క్రికెటర్ ఎవరా..? అని తెలుసుకోవాలని ఉందా..
‘వీరేంద్ర సెహ్వాగ్..‘ ఈ మాజీ క్రికెటర్‌ని మించిన విధ్వంసకర క్రికెటర్ మరొకరు లేరు. క్రికెట్ ప్రపంచానికి టీ20 ఫార్మాట్ పుట్టుకొచ్చాక ధనాధన్ క్రికెట్ గుర్తొచ్చిందేమో కానీ, సెహ్వాగ్ ఎప్పుడో ఈ ఆట ఆడేశాడు. ఫార్మాట్ ఏదైనా దూకుడు మంత్రమే అతని స్టయిల్. సెంచరీ చేయడానికి 4 పరుగులు అవసరం ఉన్నా.. బౌండరీ కొట్టి శతకం చేద్దామన్నదే అతని ఆలోచన. అదే అతనిని కోట్లాది అభిమానులకు దగ్గర చేసింది. ఇప్పటికీ సెహ్వాగ్‌ని ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా 90’స్ కిడ్స్‌కు సెహ్వాగ్ అన్నా.. అతని ఆట తీరు అన్నా చాలా మక్కుఎక్కువ. అలాంటి గొప్ప మాజీ దిగ్గజం.. ఒక క్రికెటర్ ను అంచనా వేయడంలో పొరబడ్డాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. ఎవరా క్రికెటర్..? ఏంటా ఆ కథ..? అన్నది తెలుసుకోవాలని ఉందా! అయితే చదివేయండి.
అగ్రెసివ్‌నెస్‌కు మరో పేరు.. ‘విరాట్ కోహ్లీ‘. ఇది కోహ్లీని కించపరచాలని కాదు. ఫీల్డ్‌లో విరాట్ కోహ్లీ యాటిట్యూడ్. మాటంటే పడడు. మాటకు మాట అని తీరుతాడు. అరిస్తే ఊరుకోడు. మరింత గట్టిగా అరిచి ఎదుటివారికి వార్నింగ్ ఇస్తాడు. ఇక మీద మీదకు వస్తే.. అంతే. నటసింహం బాలయ్యలా గుడ్లురిమి చూస్తాడు. ఈ దూకుడు స్వభావమే.. కోహ్లీకి మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. టీమిండియాకు కెప్టెన్‌ని చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు దగ్గర చేసింది. కానీ, కోహ్లీలో మొదట ఈ దూకుడు చూసిన సెహ్వాగ్.. ఇతడు క్రికెట్‌లో ఎక్కువ కాలం కొనసాగడని అనుకున్నాడట. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్.. కోహ్లీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Happy Birthday #Viru #sehwag
Pajji childhood hero fearless and attacking batting style Test=Odi Odi=T20 T20=T10 format May be changed but your attacking batting is not changed #virendersehwag #HappyBirthdayVirenderSehwag @virendersehwag pic.twitter.com/1s0NlKYuhW— Thalapathy_Vicky_1510 (@Virahulvignesh1) October 19, 2021
“కోహ్లీలో నైపుణ్యానికి కొదవలేదు.. అతడి టాలెంట్ ఏంటన్నది అప్పట్లోనే నాకు తెలుసు. కానీ అతను కెరీర్‌లో ఇంత సక్సెస్ సాధిస్తాడని మాత్రం అస్సలు ఊహించలేదు. అతనిపై ఇతరులకు నమ్మకం ఉన్నా.. నాకు మాత్రం ఉండేది కాదు. అతడు దూకుడు చూసి త్వరగానే కనుమరుగవుతాడనిపించింది. లసిత్ మలింగ ఓవర్‌లో ఫోర్లు బాదినా, 40 ఓవర్లలో 280 పరుగులు కావాల్సిన సమయంలో ఓ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించినా.. నా ఆలోచన మాత్రం మారలేదు. అంతెందుకు కోహ్లీ 75 సెంచరీలు చేసేంత దూరం వస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు..”
“ఇలా కోహ్లీని తక్కువ అంచనా వేసింది నేనొక్కడినే కాదు.. చాలా మంది ఉన్నారు.. అందరకీ కోహ్లీ తన ఆటతోనే సమాధానం చెప్పాడు. అతన్ని చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. నాతో ఆడిన కుర్రాడు ఇంత సక్సెస్ సాధించాడా? అంటే ఆశ్చర్యమేస్తోంది. అతను ఈ స్థాయికి చేరడానికి కొత్తగా ఏమీ చేయలేదు. అతని పట్టుదలే అతన్ని ఈ స్థాయికి చేర్చింది. ఆ క్రమశిక్షణ చూడండి.. మూడే విషయాలు. వ్యాయామం, ఫిట్‌నెస్, పరుగులు. ఈ మూడింటిపైనే ఫోకస్ పెట్టాడు. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కోహ్లీతో పాటు ఎందరో ప్లేయర్లు వచ్చారు.. ఆడారు.. వెళ్లిపోయారు. కానీ కోహ్లీ మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా సక్సెస్ అయ్యాడు..” అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virender Sehwag said – “No one ever doubted Virat Kohli’s talent but I didn’t believe that Kohli would reach the heights he has now, The Legendary status and hit 75 hundreds. Today, he has proven everyone including me wrong. The greatness Kohli has reached today is unbelievable”. pic.twitter.com/HGXBfxSLpC
— sportstak (@djnewstak) March 25, 2023